Bandi Sanjay: తెలంగాణ అంతటా పోటీ చేయండి.. అసదుద్దీన్ ఓవైసీకి బండి సంజయ్ సవాల్..
అసద్ కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎంఐఎంకు దమ్ముంటే తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎంఐఎంకు డిపాజిట్లు రాకుండా చేస్తామని చెప్పారు. ఎంఐఎంను ముస్లింలే చీత్కరిస్తున్నారని.. అధికార పార్టీతో అంటకాగుతూ ఆస్తులు కాపాడుకోవడమే ఓవైసీ నైజమని మండిపడ్డారు. ఇన్నేళ్లుగా పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో చెప్పాలన్నారు బండి సంజయ్.
బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల తూటాలు ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్‌తో బీజేపీ నేతలో ఫుల్ టు ఫుల్ ఫైరింగ్‌లో ఉన్నారు. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన స్టైల్‌లో విరిచుకు పడ్డారు. దారుస్సలాంలో కూర్చుని ప్రేలాపనలా.. అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే.. తెలంగాణ అంతటా పోటీ చేయాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌ను సంకలేసుకొస్తారో.. కాంగ్రెస్‌తో కలిసి వస్తారో రండి.. బీజేపీ సింహం.. సింగిల్‌గా పోటీ చేస్తుందంటూ మాటల తూటాలను వదలిరారు. అంతేకాదు ఎంఐఎం నేతలకు సూటి ప్రశ్నలు వేశారు. ఇన్నేళ్లుగా పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో చెప్పాలంటూ ప్రశ్నించారు.
పాతబస్తీలోని ముస్లిం యువకులకు పాస్ పోర్టులు కూడా రాని దుస్థితి ఎందుకొచ్చిందని అడిగారు బండి సంజయ్. ఎంఐఎం పార్టీని ముస్లింలే చీత్కరిస్తున్నారని.. అధికార పార్టీతో అంటకాగుతూ ఆస్తులు కాపాడుకోవడమే ఒవైసీ నైజం అంటూ విమర్శించారు. ఎంఐఎం చేతిలోనే కారుందని ఎద్దేవ చేశారు. దారుస్సలాంలో కూర్చొని బీరాలు పలకడం కాదు.. నిజంగా మీకు దమ్ముంటే, మొగోళ్లయితే తెలంగాణ అంతటా పోటీ చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
సొంతంగా బలపడకుండా ఇంకో పార్టీ బలపడాలని కోరుకునే ఎంఐఎం నాయకులు అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగుతూ సొంత ఆస్తులను కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ముస్లిం సమాజమే ఎంఐఎం పార్టీని చీత్కరిస్తోందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం