Telangana: అయ్యప్ప పుట్టుకని అవమానపరిచిన భైరి నరేష్‌పై పలు స్టేషన్ లో కేసులు నమోదు.. పీడీ యాక్ట్ పెట్టి జైలుకి పంపాలని డిమాండ్
అయ్యప్ప జననంపై జుగుప్సాకర కామెంట్స్ చేసిన భైరి నరేష్‌పై పలు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. నరేష్‌పై 153A, 295A, 298, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని వికారాబాద్ ఎస్పీ హెచ్చరించారు.
అయ్యప్ప భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.అయ్యప్పపై కాంట్రవర్సీ కామెంట్స్ హీట్ పెంచాయి. భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు, మహిళలు మండిపడ్డారు. హిందూ దేవుళ్లు, అయ్యప్పస్వామిపై భారత నాస్తికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు భైరి నరేష్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.అతని వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా వీహెచ్‌పీ, అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుజిల్లాలో అయ్యప్పస్వాములు, వీహెచ్‌పీ, భజరంగ్‌దల్, బీజేపీ నేతలు నడిరోడ్డుపై ధర్నాలు చేశారు. spot..
వికారాబాద్‌జిల్లా కోస్గిలో అయ్యప్పమాలధారులు ఆందోళన చేస్తుండగా భైరి నరేష్ అనుచరుడు వీడియో తీశారు. నరేశ్ స్పీచ్‌ను సమర్థించిన యూట్యూబర్ బాలరాజును చావబాదారు అయ్యప్ప భక్తులు. రెండ్రోజుల క్రితం కొడంగల్‌లో జరిగిన అంబేద్కర్ సభలో బైరి నరేష్ హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేము నాస్తికులం. దేవుళ్లను నమ్మం. అంబేద్కర్ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇక అయ్యప్ప స్వామి పుట్టుక గురించి అవమానపరుస్తూ కామెంట్స్ అగ్గిరాజేశాయి.
అయ్యప్ప జననంపై జుగుప్సాకర కామెంట్స్ చేసిన భైరి నరేష్‌పై పలు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. నరేష్‌పై 153A, 295A, 298, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని వికారాబాద్ ఎస్పీ హెచ్చరించారు. హిందూ దేవుళ్లను అవమానపరిచిన బైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అయ్యప్పమాలధారులతోపాటు వీహెచ్‌పీ, భజరంగ్‌దల్, బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇదంతా నాస్తికసమాజం, హిందూదేవుళ్లపై చేస్తున్న కుట్రగా అభివర్ణించారు వీహెచ్‌పీ నేతలు.
హిందు ధర్మాన్ని,అయ్యప్ప స్వామి వారిని కించపరుస్తున్న ఈ చిల్లరా గానిపై వెంటనే PD Act పెట్టాలి Name : Naresh Bairi Contact : 7013160831 @TelanganaCMO @DgpTelangana@hydcitypolice #Hindus #justice #jaisriram pic.twitter.com/ZbmTFmMTk1
— Jella Sudhakar BJP (@jellasudhakar) December 30, 2022
అయ్యప్పపై వివాదాస్పద వ్యాఖ్యలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. హిందూ దేవుళ్లను కించపరిచినా బైరి నరేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశారు. అటు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నరేశ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అతనిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్ల నేతాజీ చౌరస్తాలో అయ్యప్ప స్వాములు నిరసనకు దిగారు. భైరి నరేశ్‌ను శిక్షించాలంటూ రాస్తారోకో చేశారు. హిందూ దేవుళ్లను కించపర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రంగారెడ్డిజిల్లా మొయినాబాద్‌లో అయ్యప్పస్వాములు, భజరంగ్‌దల్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. జై శ్రీరామ్, అయ్యప్పనామస్మరణతో మార్మోగింది. వరంగల్, మొయినాబాద్,పటాన్‌చెరు, హైదరాబాద్, ఆదిలాబాద్,వనపర్తి,నారాయణపేటజిల్లాలో అయ్యప్పభక్తులు ఆందోళనకు దిగారు. మొత్తానికి బైరి నరేష్ వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పోలీసులు సీరియస్ యాక్షన్ చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..