Dalita Bandhu Scheme: ‘దళిత బంధు’పై అవగాహన సదస్సు.. ఈ నెల 26వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షత జరగబోయే..
Dalita Bandhu Scheme: తెలంగాణలో దళిత బంధు పథకం అమలుకు సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ పథకం అమలు,
Dalita Bandhu Scheme: తెలంగాణలో దళిత బంధు పథకం అమలుకు సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సంబంధిత శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈనెల 26వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో తొలి అవగాహన సదస్సు జరుగనుంది. ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున ( ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు), ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున ( ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు పాల్గొంటారు. వారితో పాటు 15 మంది రిసోర్సు పర్సన్స్ పాల్గొంటారు. మొత్తంగా 427 మంది హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులు ఈ అవగాహన సదస్సులో పాల్గొంటారు.
అధికారిక సమాచారం ప్రకారం.. జులై 26వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల నుంచి వారి వారి మండల కేంద్రాలకు ఉదయం 7 గంటలకు చేరుకుంటారు. మండల కేంద్రంలో అల్పాహార కార్యక్రమం ముగించుకుని అనంతరం అక్కడ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి.. మొత్తం 427 మంది పలు బస్సుల్లో హైద్రాబాద్‌కు బయలుదేరుతారు. ఉదయం 11 గంటల వరకు హైద్రాబాద్ ప్రగతి భవన్‌కు చేరుకుంటారు.
కాగా, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో ‘దళిత బంధు’ పథకం ముఖ్య ఉద్దేశ్యం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ తో పాటు పథకాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి అవగాహన కల్పిస్తారు. ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో ప్రారంభం కానున్న ‘దళితబంధు’ పథకం, రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏవిధంగా దోహదపడుతుందని సీఎం అభిప్రాయం. పైలట్ ప్రాజెక్టును హుజూరాబాద్ లో చేపట్టిన నేపథ్యంలో చారిత్రాత్మక పథకంలో ఆ ప్రాంత బిడ్డలుగా ఎలా లీనమై పనిచేయాలి, దళితుల సామాజిక ఆర్థిక గౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న తెలంగాణ దళిత బంధు పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు ఏమిటి? ఈ పథకాన్ని ఎలా దళితుల్లోకి తీసుకపోవాలి? వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా ఎలా వారికి అవగాహన కల్పించాలి? అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి, కలిసి పోవాలి? అనే తదితర అంశాలను ఈ సమావేశానికి హాజరైన వారికి సీఎం కేసీఆర్ వివరించి అవగాహన కల్పిస్తారు.
Also read:
Rakul Preet Singh: హెల్ప్ చేయాలంటూ రకుల్ ఆర్తనాదాలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..