AP Inter Second Year Results: మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి..
AP Inter Second Year Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు వెల్లడికానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి..
AP Inter Second Year Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు వెల్లడికానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ పరీక్షాల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు అయిన http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in, http://results.apcfss.in, http://bie.ap.gov.in లలో చూసుకోవచ్చుు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై పెను దుమారం రేగిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించొద్దని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేయగా.. పరీక్షలు నిర్వహించి తీరుతామంటూ ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది. దాంతో ఆ వివాదం కాస్తా.. సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు వార్నింగ్ ఇవ్వడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామంది. ఆ నేపథ్యంలోనే ఫలితాల ప్రకటనకు అనుసరించాల్సిన విధానంపై సూచనలు, సలహాల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్ సెకండర్ ఇయర్ ఫలితాలను ఇవాళ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,32,469 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉండగా.. వీరిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 5,12,959 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,19,510 మంది విద్యార్థులు ఉన్నారు.
Also read:
Varun Sandesh: ఉదయ్ కిరణ్, తరుణ్‌లతో నన్ను పోల్చొద్దు.. హీరో వరుణ్ సందేశ్ షాకింగ్ కామెంట్స్..