California wildfire: పుట్టబోయే బిడ్డ జెండర్ రివీల్ పార్టీ ఏర్పాటు చేసిన అమెరికా దంపతులపై 30 కేసులు నమోదు.. అసలేం జరిగిందంటే..?
ఎంకి పెళ్లి.. సుబ్బు చావుకు వచ్చిందన్నట్లు.. బంధుమిత్రులకు దావత్ ఇస్తే.. ఆడవి అంతా అంటుకుంంది. దీంతో పోలీసులు ఏకంగా 30 కేసులు నమోదు చేశారు.
US Gender reveal party: ఎంకి పెళ్లి.. సుబ్బు చావుకు వచ్చిందన్నట్లు.. బంధుమిత్రులకు దావత్ ఇస్తే.. ఆడవి అంతా అంటుకుంంది. దీంతో పోలీసులు ఏకంగా 30 కేసులు నమోదు చేశారు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకుంది. కాలిపోర్నియా ప్రాంతానికి చెందిన రెఫ్యూజియో మాన్యుయేల్ జిమెనెజ్ జూనియర్, ఎంజెలా రీనీ జిమినెజ్ దంపతులు.. తమకు పుట్టబోయే బిడ్డ జెండర్ రివీల్ పార్టీ ఏర్పాటు చేసింది. ఎల్‌డొరాడోలో అన్ని రకాల వంటలతో పాటు వినోద కార్యక్రమాలు అరెంజ్ చేశారు.
ఇందులో భాగంగా పైరోటెక్నిక్ (నిప్పలు వెదజల్లే) వస్తువులను ఈ పార్టీ కోసం ఉపయోగించారు. ఆ సమయంలో వెలువడిన మంటలు అదుపు తప్పాయి. దీంతో పక్కనే ఉన్న చెట్లకు మంటలు అంటుకున్నాయి. వేగంగా వ్యాపించిన మంటలు ఎల్‌డొరాడో ప్రాంతంలోని అడవులకు పాకాయి. ఈ ప్రమాదంలో సుమారు 23వేల ఎకరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో ఈ జంటపై స్థానిక పోలీసులు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కార్చిచ్చు దావానలంలా వ్యాపించడంతో ఐదు ఇళ్లు ధ్వంసం అవడంతోపాటు, ఒక అగ్నిమాపక అధికారి కూడా మరణించారు. రెఫ్యూజియో మాన్యుయేల్ జిమెనెజ్ జూనియర్, ఎంజెలా రీనీ జిమినెజ్ జంట వల్లే ఇదంతా జరిగిందని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో వీరిపై 30 నేరాలు చేసినట్లు కేసు నమోదైంది.
Read Also… Red Panda: డార్జిలింగ్‌లో అరుదైన ఎర్ర పాండా జననం.. అంతరించి పోతున్న ఈ పాండా ప్రత్యేకతలు ఏంటంటే..