AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart On Right Side: ఎంతకీ దగ్గు తగ్గకపోవడంతో ఎక్స్‌రే తీయించుకున్న యువతి.. రిపోర్ట్‌లో బయట పడ్డ షాకింగ్‌ నిజం..

Heart On Right Side: మీకు నిఖిల్‌ హీరోగా నటించిన 'కేశవ' చిత్రం గుర్తుందా..? అందులో హీరో ఓ అసాధారణ సమస్యతో బాధపడుతుంటాడు. అదే.. అందరికీ ఎడమ వైపు ఉండాల్సిన గుండె...

Heart On Right Side: ఎంతకీ దగ్గు తగ్గకపోవడంతో ఎక్స్‌రే తీయించుకున్న యువతి.. రిపోర్ట్‌లో బయట పడ్డ షాకింగ్‌ నిజం..
Heart Wrong Side
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 24, 2021 | 11:38 PM

Heart On Right Side: మీకు నిఖిల్‌ హీరోగా నటించిన ‘కేశవ’ చిత్రం గుర్తుందా..? అందులో హీరో ఓ అసాధారణ సమస్యతో బాధపడుతుంటాడు. అదే.. అందరికీ ఎడమ వైపు ఉండాల్సిన గుండె ఈ సినిమాలో హీరోకు మాత్రం కుడివైపు ఉంటుంది. రవితేజ హీరోగా నటించిన ‘డిస్కో రాజా’లోనూ హీరో ఇలాంటి పాత్రలోనే కనిపిస్తాడు. ఇదంతా సినిమా కాబట్టి వినడానికి, చూడడానికి బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ నిజంగా హృదయం కుడివైపు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. నమ్మడానికి కూడా అసాధ్యంగా ఉంటుంది కదూ! కానీ ఇలాంటి ఓ ఘటన నిజంగానే జరిగింది. అమెరికాకు చెందిన ఓ యువతి గుండె కుడి వైపు ఉంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.

American Girl Heart

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని చికాగో నగరానికి చెందిన 19 ఏళ్ల క్లారీ మక్‌ అనే యువతి కొన్ని రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతోంది. దీంతో పరీక్ష చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు సూచించిన మేరకు కొన్ని మందులు వాడింది. అయితే దగ్గు ఎంతకూ తగ్గకపోవడంతో ఊపిరితిత్తుల్లో ఏమైనా సమస్య ఉందా? అని భావించిన వైద్యులు ఎక్స్‌రే తీయించుకోవాలని తెలిపారు. రిపోర్ట్‌ వచ్చిన తర్వాత వాటిని చూసిన వైద్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. సాధారణంగా ఎడమవైపునకు ఉండాల్సిన గుండె.. క్లారీ మక్‌కు మాత్రం కుడి వైపు ఉంది. దీంతో క్లారీ తీవ్ర ఆందోళనకు గురైంది. ఇంతకీ గుండె కుడి వైపునకు ఉండడానికి గల కారణాన్ని వైద్యులు వివరిస్తూ.. దీన్ని వైద్య భాషలో ‘డెక్స్‌ట్రోకార్డియా’ అంటారని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్ని అంతటినీ క్లారీ టిక్‌టాక్‌ వీడియో చేసి పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.

Also Read: Wedding Gown: వ్యర్ధాలకు అర్ధం కలిపిస్తూ.. వాడిపడేసిన మాస్కులతో వెడ్డింగ్ గౌన్ ను రూపొందించిన డిజైనర్

Housing scheme : ముప్ఫై లక్షల మంది పేదలకు ఉచితంగా ఇల్లు కట్టించడం ఒక చరిత్ర : శ్రీరంగనాధ్ రాజు

Patanjali IPO: ఐపిఓగా అవతరిస్తున్న పతంజలి.. ఎప్పుడో డేట్ చెప్పిన బాబా రామ్‌దేవ్

తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌..రోజుకు ఎన్ని తాగుతున్నారంటే?
తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌..రోజుకు ఎన్ని తాగుతున్నారంటే?
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్
వారమంతా చికెన్ లాగించేస్తున్నారా.. ఈ రిస్క్ ఉంది జాగ్రత్త!
వారమంతా చికెన్ లాగించేస్తున్నారా.. ఈ రిస్క్ ఉంది జాగ్రత్త!
ట్రెండింగ్‌లో 'ఆవిడే మా ఆవిడే' సెకెండ్ హీరోయిన్?ఇప్పుడెలా ఉందంటే?
ట్రెండింగ్‌లో 'ఆవిడే మా ఆవిడే' సెకెండ్ హీరోయిన్?ఇప్పుడెలా ఉందంటే?
30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా.?
30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా.?
చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ