Red Panda: డార్జిలింగ్‌లో అరుదైన ఎర్ర పాండా జననం.. అంతరించి పోతున్న ఈ పాండా ప్రత్యేకతలు ఏంటంటే..

Red Panda: పాండా అనగానే మనకు వెంటనే నలుపు, తెలుపు రంగులో చూడముచ్చటగా కనిపించే రూపం గుర్తొస్తుంది. అయితే పాండాలు ఈ రంగులోనే కాకుండా ఎరుపు రంగులో కూడా ఉంటాయని మీకు తెలుసా.?

Red Panda: డార్జిలింగ్‌లో అరుదైన ఎర్ర పాండా జననం.. అంతరించి పోతున్న ఈ పాండా ప్రత్యేకతలు ఏంటంటే..
Red Panda
Follow us

|

Updated on: Jul 23, 2021 | 5:49 AM

Red Panda: పాండా అనగానే మనకు వెంటనే నలుపు, తెలుపు రంగులో చూడముచ్చటగా కనిపించే రూపం గుర్తొస్తుంది. అయితే పాండాలు ఈ రంగులోనే కాకుండా ఎరుపు రంగులో కూడా ఉంటాయని మీకు తెలుసా.? పునుగు పిల్లిలను పోలి ఉండే ఈ పాండాలు అత్యంత అరుదుగా కనిపిస్తుంటాయి. అసలు పాండాలే అరుదుగా ఉంటాయంటే ఈ ఎర్ర పాండాలు మరీ అరుదుగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఈ పాండాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే ఈ రెడ్ పాండా అత్యంత అరుదైన జంతువు జాబితాలో చేరిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా వెస్ట్‌ బెంగాల్‌లో యేషి అనే ఓ రెడ్‌ పాండా బుల్లి పాండాకు జన్మనిచ్చింది. డార్జిలింగ్‌లోని పద్మజా నాయుడు హిమాలయన్‌ జులాజికల్‌ పార్కులో ఈ చిన్న పాండా జన్మించింది. ప్రస్తుతం తల్లి పాండా.. బుజ్జి పాండా ఆరోగ్యంగా ఉన్నాయని. ఈ సీజన్‌లో జన్మించిన పాండాల సంఖ్య 5కు చేరిందని జూ డైరెక్టర్‌ ధర్మ్‌డియో రాయ్‌ తెలిపారు.

ఈ పాండాల ప్రత్యేకత ఏంటంటే..

అత్యంత అరుదుగా కనిపించే రెడ్‌ పాండాలు ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌, డార్జిలింగ్‌ లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జీవిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాండా సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువగా ఉంది. ఇక ఈ పాండాలు చాలా బద్దకమైనవి చెబుతుంటారు. ఈ బద్దకమే ఆ జాతి ఉనికి ప్రశ్నార్థకంగా మారడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రూర జంతువులు దాడికి దిగినా ఇవి పారిపోవంటా. మొదట్లో వీటిలో పోరాటశైలి ఉన్నప్పటికీ అనంతరం ఆ లక్షణాలను కోల్పోయాయి. నిజానికి రెడ్ పాండాలు తొలుత మాంసాహారిగా ఉండేవి కానీ కాల క్రమేణా శాఖహారీగా మారిపోయాయి. ఇవి అలా ఎందుకు మారాయన్న దానిపై ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేవు. అంతరించి పోతున్న ఈ జాతిని కాపాడుకోవడం కోసం ఇండియన్ వెటరినరి రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమ బెంగాల్, సిక్కింలలోని కొన్ని ఎర్ర పాండాలు కెనైన్ డిస్టెంపర్ అనే వైరస్ బారిన పడ్డాయని ఐవీఆర్ఐ తెలిపింది. ఈ పరిస్థితుల్లో కనీసం కృత్రిమ పద్ధతుల్లో అయినా వీటి సంఖ్యను పెంచేందుకు ఐవీఆర్ఐ ప్రయత్నిస్తోంది.

Red Panda Rare

Also Read: Password Safety: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగులు విస్మరిస్తున్న ఐదు క్లిష్టమైన పాస్‌వర్డ్ భద్రతా నియమాలు ఇవే!

KTR Gift A Smile : గిఫ్ట్ ఎ స్మైల్ : బర్త్ డే సమయాన అద్భుతమైన ప్రకటన చేసిన కేటీఆర్

Astronaut: మీకు తెలుసా.. వ్యోమ‌గాముల విషయంలో అంత‌రిక్షంలో అలా జరుగుతోందట..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..