Murder: హత్యకు దారి తీసిన వాలీబాల్ గోడవ.. కత్తితో విచక్షణా రహితంగా దాడి.. 16 ఏళ్ల బాలుడు మృతి.
Murder: గుంటూరు జిల్లాలోని ముప్పాళ్లలో గురువారం దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య చిన్నగా మొదలైన గొడవ ఏకంగా హత్యకు దారి తీసింది. విచక్షణా రహితంగా జరిగిన కత్తి దాడిలో...
Murder: గుంటూరు జిల్లాలోని ముప్పాళ్లలో గురువారం దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య చిన్నగా మొదలైన గొడవ ఏకంగా హత్యకు దారి తీసింది. విచక్షణా రహితంగా జరిగిన కత్తి దాడిలో 16 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్లకు చెందిన పఠాన్ అఫ్రిద్, షేక్ సుభానీలు స్నేహితులు. బక్రీద్ పండగ సందర్భంగా స్థానికంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగానే వీరిద్దరి మధ్య చిన్నపాటి గోడవ జరిగింది. ఈ విషయాన్ని సుభానీ తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో సుభాని పెదనాన్న షేక్ పెదబాజి అఫ్రిద్‌తో గొడవపెట్టుకున్నాడు.
రోడ్డుపై వెళుతోన్న అఫ్రిద్‌తో మాట్లాడుతూ మాట్లాడుతూనే కత్తితో దాడి చేశాడు. దీంతో అఫ్రిద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అఫ్రిద్‌ను సరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన అఫ్రిద్ చికిత్స పొందుతుండగానే మరణించాడు. అఫ్రిద్ ముప్పాళ్ల హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పట్టాభి రామయ్య తెలిపారు. అఫ్రిద్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక నిందితుడు షేక్ పెదబాజిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగింది.
Poker Game : రాజకీయ అండదండలు.. పోలీసులతో సరిహద్దుల్లో కోతికొమ్మచ్చాడుతోన్న పేకాటరాయుళ్లు.!
Death Mystery: ఆ ప్రాంతంలో వరుసగా చనిపోతున్న పిల్లులు.. పోలీసుల రాకతో బయటపడ్డ సంచలన విషయాలు!