Accident: కడప జిల్లాలో దారుణం.. అన్నదమ్ముల బైక్‌లు ఢీ.. తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయిన తమ్ముడు..

Accident: ఎన్నో ప్రమాదాలు చూసింటారు. మరెందరో ఆ ప్రమాదాల్లో చనిపోవడం చూసింటారు. కానీ ఈ ప్రమాదం మరీ దారుణం అనే చెప్పాలి.

Accident: కడప జిల్లాలో దారుణం.. అన్నదమ్ముల బైక్‌లు ఢీ.. తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయిన తమ్ముడు..
Accident
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 23, 2021 | 8:09 AM

Accident: ఎన్నో ప్రమాదాలు చూసింటారు. మరెందరో ఆ ప్రమాదాల్లో చనిపోవడం చూసింటారు. కానీ ఈ ప్రమాదం మరీ దారుణం అనే చెప్పాలి. విధి వైపరిత్యానికి ఇదో మచ్చుతునకగా పేర్కొనాలి. సొంత అన్నదమ్ముల బైక్‌లు ఢీకొనగా.. తమ్ముడు దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర ఘటన కడప జిల్లాలోని కలసపాడు మండలం కేంద్రం సమీపంలో చోటు చేసుకుంది. రాత్రి 9.30 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కలసపాడు కు చెందిన మస్తాన్, షేక్ పీరాంబీ దంపతులకు ఇద్దరు కొడుకులు షేక్ షరీఫ్, షేక్ షఫీ ఉన్నారు. పెద్ద కుమారుడు షరీఫ్.. సిద్దుమూర్తిపల్లి సమీపంలో ఉన్న పాలకేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు విద్యాశాఖ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు.

అయితే, షరీఫ్ తన విధులను ముగించుకుని కలసాపడులోని ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో షఫీ.. వ్యక్తిగత పనులపై చెన్నారెడ్డిపల్లెకు బైక్‌పై బయలుదేరాడు. అయితే, ఎదురెదురుగా వస్తున్న వీరిద్దరూ పోరుమామిళ్ల రోడ్డులోని కోతి సమాధి సమీపంలో ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. షఫీ అక్కడికక్కడే మృతి చెందాడు. షరీఫ్‌కు గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరిక్షీంచిన వైద్యులు.. ప్రమాదం ఏమీ లేదని, స్వల్ప గాయాలే అయ్యాయని చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎస్ఐ రామాంజనేయులు.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Missing Mystery: నాగార్జునసాగర్‌ జెన్‌కోలో ఉద్యోగి కుటుంబం అదృశ్యం.. పోలీసుల దర్యాప్తు వెలుగులోకి ఆసక్తికర విషయాలు..!

Tokyo Olympics 2021 Live: ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్.. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో సత్తాచాటిన దీపిక కుమారి

Karthika Deepam Latest: ఎమోషనల్ ట్విస్ట్..మూడంకెలు లెక్కపెట్టిన మోనిత.. కార్తీక్ ను అసహ్యించుకుంటున్న తండ్రి..సర్ది చేప్పే ప్రయత్నంలో వంటలక్క!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?