AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Death Mystery: ఆ ప్రాంతంలో వరుసగా చనిపోతున్న పిల్లులు.. పోలీసుల రాకతో బయటపడ్డ సంచలన విషయాలు!

హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతంలో మూగ జీవాల మృతదేహాలు కలకలం రేపుతోంది. అనుమానాస్పద స్థితిలో పిల్లులు మృత్యువాతపడ్డాయి.

Death Mystery: ఆ ప్రాంతంలో వరుసగా చనిపోతున్న పిల్లులు.. పోలీసుల రాకతో బయటపడ్డ సంచలన విషయాలు!
Cats Died
Balaraju Goud
|

Updated on: Jul 22, 2021 | 1:59 PM

Share

Serial Cats Dead in Hyderabad: హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతంలో మూగ జీవాల మృతదేహాలు కలకలం రేపుతోంది. అనుమానాస్పద స్థితిలో పిల్లులు మృత్యువాతపడ్డాయి. వీటిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఇద్దరు మహిళలు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ హైదాబాద్ పరిధిలోని గుండ్లపోచంపల్లి ప్రాంతానికి చెందిన స్ల్పెండిడ్‌ అపర్ణ ఫామ్‌ డోస్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న అనిత పీటర్స్‌, అనిషా చౌదరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విల్లా నంబర్‌ 132 సమీపంలో మూగజీవాలు (పిల్లులు) చనిపోయి ఉండడాన్ని పలుమార్లు చూశారు. వాటిని తీవ్రంగా గాయపరిచి రెండు కాళ్లు తాళ్లతో కట్టి హింసాత్మకంగా చంపుతున్నట్లు గుర్తించారు. దీంతో వారు మంగళవారం పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన పిల్లులను పుండూరుకు చెందిన ప్రభుత్వ వెటర్నరీ వైద్యులు పోస్టుమార్టం చేపట్టారు. వరుసగా మూగజీవాలు మృత్యువాత పడడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు, ఎందుకు చంపుతున్నారనే అంశాలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు తెలిపారు.

Read Also…  Viral Video: పార్లమెంట్‌ సభలో ఊహించని సంఘటన.. నేతలు పరుగో పరుగు.. వైరల్ వీడియో.!

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ