Gold Price Today: కొనసాగుతోన్న బంగారు ధరల పతనం.. వరుసగా రెండో రోజు. శుక్రవారం భారీగా తగ్గిన గోల్డ్ రేట్..
Gold Price Today: దేశంలో కరోనా సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకానొక సమయంలో తులం బంగారం రూ. 50 వేలు దాటిన...
Gold Price Today: దేశంలో కరోనా సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకానొక సమయంలో తులం బంగారం రూ. 50 వేలు దాటిన సందర్భాలు చూశాం. అయితే తదనంతరం పరిస్థితుల నేపథ్యంలో గోల్డ్ రేట్స్ తగ్గుతూ వచ్చాయి. తాజాగా గురువారం తగ్గిన గోల్డ్ పతనం శుక్రవారం కూడా కొనసాగింది. గురువారంతో పోలీస్తే శుక్రవారం బంగారం ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. * దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,700 (గురువారం రూ. 47,050 ) కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,950 గా (గురువారం రూ. 51,330) ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,900 (గురువారం రూ. 47,120 ) గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ. 47,900 వద్ద (గురువారం రూ. 48,120) కొనసాగుతోంది. * బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,550 (గురువారం రూ. 44,900 ) వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,600 గా (గురువారం రూ. 48,980 ) గా నమోదైంది. * చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,000 (గురువారం రూ. 45,300 ) గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,010 గా (గురువారం రూ. 49,420 ) వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలో భారీ పతనం కనిపించింది. హైదారాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.44,550 (గురువారం రూ. 44,900 ) గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,600 (గురువారం రూ. 48,980) వద్ద నమోదైంది. * విజయవాడలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 44,550 (గురువారం రూ. 44,900 ) కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,600 గా (గురువారం రూ. 48,980 ) ఉంది. * విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,550 (గురువారం రూ. 44,900 ) వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,600 (గురువారం రూ. 48,980 ) వద్ద కొనసాగుతోంది.
Also Read: Patanjali IPO: ఐపిఓగా అవతరిస్తున్న పతంజలి.. ఎప్పుడో డేట్ చెప్పిన బాబా రామ్‌దేవ్
India Business: ప్రపంచ దేశాలతో చైనా కయ్యం..భారతదేశానికి తెచ్చింది లాభం.. ఎలాగంటే..