Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వస్తువు మీ ఇంట్లో ఎలా ఉంటుందో ముందే తెలసుకోవచ్చు.. ఫ్లిప్‌కార్ట్ సరికొత్త టెక్నాలజీ.

Flipkart: ఇప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్ ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. కానీ ఒకప్పుడు మాత్రం ఆన్‌లైన్‌ వస్తువులు కొనుగోలు చేయాలంటే అందరూ భయపడే వారు. ఎంపిక చేసుకున్న వస్తువే వస్తుందా.? వచ్చినా అది...

Flipkart: ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వస్తువు మీ ఇంట్లో ఎలా ఉంటుందో ముందే తెలసుకోవచ్చు.. ఫ్లిప్‌కార్ట్ సరికొత్త టెక్నాలజీ.
Flipkart Ar Camera
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 23, 2021 | 5:48 AM

Flipkart: ఇప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్ ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. కానీ ఒకప్పుడు మాత్రం ఆన్‌లైన్‌ వస్తువులు కొనుగోలు చేయాలంటే అందరూ భయపడే వారు. ఎంపిక చేసుకున్న వస్తువే వస్తుందా.? వచ్చినా అది ఆన్‌లైన్‌ సైట్‌లో కనిపిస్తోన్న అంత క్వాలిటీగా ఉంటుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంటి పక్కనే దుకాణం ఉన్నా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరగిపోతోంది. ఈ కారణంగానే ఈ కామర్స్‌ రంగంలో పోటీ తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆన్‌లైన్‌ షాపింగ్ సంస్థలు కొత్త కొత్త ఆఫర్లు, ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. యూజర్లకు రియాలిటీ ఫీలింగ్ కలిగించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌ తమ వినియోగదారులకు సరికొత్త షాపింగ్‌ అనుభూతిని కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆగ్మెంటెడ్‌ రియాలిటీతో మీరు కొనుగోలు చేయాలనుకున్న వస్తువులను ముందుగానే మీ ఇంట్లో ఎలా ఉంటాయో తెలుసుకునే వెసులు బాటును కల్పించాయి. ఫ్లిప్‌ కార్ట్‌ కెమెరా సహాయంతో టీవీ, ఫ్రిడ్జ్‌, ఫర్నిచర్‌ ఇలా పలు వస్తువులను మీరు ఎంచుకున్న చోట 3డీ ఇమేజ్‌ రూపంలో చూసుకోవచ్చు. వినియోగదారులకు మరింత షాపింగ్‌ అనుభూతిని కల్పించడానికి ఫ్లిప్‌కార్ట్‌ అడుగులు వేస్తోందని ఆ సంస్థ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ జయంద్రన్ వేణుగోపాల్ తెలిపారు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే. ముందుగా స్మార్ట్‌ ఫోన్‌లో ఫ్లిప్‌ కార్ట్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం యాప్‌ను ఓపెన్ చేసి.. మీరు కొనుగోలు చేయాలనుకున్న వస్తువుల కోసం సెర్చ్‌ చేయాలి. తర్వాత వస్తువుపై క్లిక్ చేసి.. ‘వ్యూ ఇన్‌ యూవర్‌ రూమ్‌’ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. తర్వాత ఏఆర్‌ కెమెరాను అలో నొక్కాలి. చివరిగా మీరు సదరు వస్తువును మీ ఇంట్లో ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో అక్కడ కెమెరాను ప్లేస్‌ చేస్తే ఆ వస్తువు 3డీ చిత్రం కెమెరాలో కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఆన్‌లైన్‌ షాపింగ్ ఇంకెన్ని పుంతలు తొక్కుతుందో అనిపిస్తోంది కదూ!

Also Read: Balanagar Fly Over: నిద్రలేకుండా అలసటగా ఉంటె బండి నడపకండి.. బాలానగర్ ఫ్లై ఓవర్ యాక్సిడెంట్ వీడియో ఇస్తున్న సందేశం ఇది!

New Virus: టిబెట్ గ్లాసియర్‌లో  15 వేల ఏళ్లనాటి మంచులో 28 కొత్త వైరస్‌లు కనుగొన్న శాస్త్రవేత్తలు..

Tesla in India: టెస్లా కారు వచ్చేస్తోంది..ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి బెజవాడ వెళ్లివచ్చేయొచ్చు .. ధర ఎంతంటే..