- Telugu News Photo Gallery Technology photos Oneplus release new smart phone nord 2 5g have a look on features and price details
One Plus Nord 2 5G: భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన వన్‌ప్లస్.. ఆకట్టుకుంటోన్న ఫీచర్లు.. ధర ఎంతంటే..
One Plus Nord 2 5G: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తాజాగా భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. జులై 28 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి...
Narender Vaitla | Edited By: Ravi Kiran
Updated on: Jul 23, 2021 | 9:09 AM

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ కొంగొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

జులై 28 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌ను అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ స్టోర్‌లు, వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

ధరల విషయానికొస్తే.. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గా ఉన్నాయి.

6.43 ఇంచెస్ 1080 పీ హెర్ట్జ్ ఫ్లూయిడ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రత్యేకత.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 4,500 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీతో పాటు 65 వాట్స్ ఛార్జ్ సపోర్ట్ అందించారు. ఫోన్ బరువు కేవలం 189 గ్రాములే ఉండడం విశేషం.





























