- Telugu News Photo Gallery Technology photos Smart watch manufacturing company firebolt release fire boltt agni smartwatch features and price details
Fire-Boltt Agni Smart Watch: మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ వాచ్.. మహిళల కోసమే ప్రత్యేకమైన ఫీచర్.. ధర ఎంతంటే..
Fire-Boltt Agni Smart Watch: తాజాగా మార్కెట్లోకి ఫైర్ బోల్ట్ అగ్ని పేరుతో కొత్త స్మార్ట్ వాచ్ విడుదలైంది. కేవలం రూ. 2,999కే అందుబాటులో ఉన్న ఈ వాచ్‌ను రిలయన్స్ డిజిటల్‌లో నెలకు రూ. 150 ఈఎమ్‌ఐతో కూడా సొంతం చేసుకోవచ్చు..
Updated on: Jul 24, 2021 | 9:08 AM

ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఓ వస్తువు. కానీ ఈ స్మార్ట్ యుగంలో వాచ్‌లు కూడా స్మార్ట్‌గా మారిపోయాయి. దీంతో మార్కెట్లోకి రోజుకో కొత్త వాచ్ క్యూ కడుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఫైర్ బోల్ట్ అనే సంస్థ 'ఫైర్ బోల్ట్ అగ్ని' అనే స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. అధునాతన ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ వాచ్ ధర డిస్కౌంట్ తర్వాత రూ. 2,999గా ఉంది.

ఆండ్రాయిడ్ 4.4 ఆపైన, ఐవోఎస్ 9 ఆ పైన పనిచేసే స్మార్ట్ ఫోన్‌లకు అనుసంధానించుకునే ఈ వాచ్‌ను 1.4 ఇంచ్ హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఈ వాచ్ బరువు కేవలం 80 గ్రాములే కావడం విశేషం.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మహిళల కోసం ప్రత్యేకంగా రుతుక్రమాన్ని ట్రాక్ చేసుకునేందుకు పీరియడ్స్ ట్రాకింగ్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎనిమిది రోజులు నిరంతరంగా నడుస్తుంది.

అంతేకాకుండా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్‌ను తెలియజేసే ఎస్‌పీవో2, స్లీప్‌ట్రాకర్, నడిచిన దూరం, స్లీప్ మోనిటరింగ్, రిమోట్ మ్యూజిక్ కంట్రోల్, సెడెంట్రీ రిమైండర్స్ లాంటి పీచర్లు ఉన్నాయి.

వాటర్ రెసిస్టెన్స్‌తో తయారు చేసిన ఈ వాచ్‌ను ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఈ వాచ్ అసలు ధర రూ. 5999కాగా రియలన్స్ డిజిటల్‌లో 50 శాతం తగ్గింపు ధరతో రూ. 2999కే అందుబాటులో ఉంది.




