Samsung The Wall: థియేటర్‌ను తలపించే టీవీ.. శాంసంగ్‌ ది వాల్‌ ధర అక్షరాల కోటి రూపాయలు.. ఫీచర్లు చూస్తే..

Samsung The Wall: ఎలక్ట్రానిక్స్‌ రంగంలో మరో అద్భుతానికి తెరలేపింది శాంసంగ్‌. ఇప్పటికే ది వాల్‌ పేరుతో భారీ టీవీని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ కంపెనీ తాజాగా దీనికి కొనసాగింపుగా రెండో వెర్షన్‌ను తీసుకొచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ టీవీపై మీరూ ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Jul 25, 2021 | 5:44 AM

టెక్నాలజీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మార్కెట్లోకి వస్తున్నాయి. ఒకప్పుడు టీవీలంటే ఫోర్టబుల్‌ కానీ ఇప్పుడంతా ఎల్‌ఈడీ టీవీల హవా నడుస్తోంది.

1 / 6
 ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ ది వాల్‌ అనే అతి భారీ స్క్రీన్‌తో కూడిన ఓ టీవీని ఇది వరకే మార్కుట్లోకి తీసుకొచ్చింది. తాజాగా దీనికి కొనసాగింపుగా ది వాల్‌ రెండో వెర్షన్‌ను ప్రవేశ పెట్టింది.

2 / 6
ఈ భారీ టీవీ 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 16కే రిజల్యూషన్‌తో 110-అంగుళాల సైజ్‌లో ఉంటుంది. 99.99 శాతం స్క్రీన్‌ టు బాడీ నిష్పత్తలో డిస్‌ప్లే అందించడం విశేషం.

3 / 6
ఈ కొత్త వెర్షన్‌లో అందించిన ఎల్‌ఈడీ ప్యాన్సల్‌తో హై కాంట్రాస్ట్, మెరుగైన కలర్ యూనిఫార్మిటీని ఇస్తాయని శాంసంగ్ తెలిపింది. ఇందులో కొత్త తరం ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

4 / 6
ఇక ఈ టీవీ ధరను శాంసంగ్‌ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ దీని ధర రూ. కోటి పైనే ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

5 / 6
షాపింగ్ మాల్స్‌, కార్పొరేట్‌ సంస్థలను టార్గెట్‌గా చేసుకుంటూ రూపొందించిన ఈ టీవీలను ప్రస్తుతం ఎంపిక చేసిన మార్కెట్లో అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా వీటిని విడుదల చేయనున్నారు.

6 / 6
Follow us