Telangana: జస్ట్ రూ.300 కోసం గొడవ.. ఏకంగా ఆటో డ్రైవర్ ప్రాణాలు తీశారు..!
జగిత్యాల జిల్లాలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 300 రూపాయల కోసం ఓ వ్యక్తి బలయ్యాడు. జగిత్యాల మండలం పొలాస శివారులో ఆదివారం (సెప్టెంబర్ 14) ఆటోడ్రైవర్ నయీముద్దీన్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసులు. హత్యకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

జగిత్యాల జిల్లాలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 300 రూపాయల కోసం ఓ వ్యక్తి బలయ్యాడు. జగిత్యాల మండలం పొలాస శివారులో ఆదివారం (సెప్టెంబర్ 14) ఆటోడ్రైవర్ నయీముద్దీన్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసులు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ హత్యకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఆటో కిరాయి విషయంలో నెలకొన్న వివాదం కారణంగానే బీహార్‌కు చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్ని అనే ఇద్దరు నయిముద్దీన్‌ను అత్యంత పాశవికంగా కొట్టి చంపినట్టు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. నిందితులిద్దరూ హైదర్‌పల్లి శివారులోని శ్రీ మణికంఠ రైస్ మిల్లులో కూలీలుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లుగా తెలిపారు. 24 గంటలు గడవక ముందే నిందితులను పట్టుకొని రిమాండ్ చేసిన రూరల్ పోలీసులను DSP ప్రత్యేకంగా అభినందించారు
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




