Raghunandan Rao: ఎమ్మెల్యే రఘునందన్ రావు పై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై తెలంగాణణ ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయ్యింది. ఆయన డీజీపీ అంజనీ కుమార్ పై దారుణ పదజాలం ఉపయోగించారని ధ్వజమెత్తింది .
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై తెలంగాణణ ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయ్యింది. ఆయన డీజీపీ అంజనీ కుమార్ పై దారుణ పదజాలం ఉపయోగించారని ధ్వజమెత్తింది . రాష్ట్రంలో బీహార్ రాజ్యాంగాన్ని డీజీపీ అమలుచేస్తున్నారని రఘునందన్ రావు వ్యాఖ్యనిచడంపై ఐపీఎస్ అధికారుల సంఘం ఈ మేరకు స్పందించింది. రఘునందన్ వి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారని మండిపడింది.. వెంటనే ఆయనపై క్రమశిక్షణా చర్యలు కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఆయన మాటలు పోలసు వ్యవస్థ నైతికతనే దెబ్బతీస్తున్నాయని. ఆగ్రహం వ్యక్తం చేసింది.
అరెస్టు నిబంధనలు పాటించకుంటే అధికారుల్ని ప్రశ్నించవచ్చు, కోర్టును ఆశ్రయించవచ్చు.. కానీ, ఆటవిక భాషను ఉపయోగించి అత్యున్నత పదవి అయిన డీజీపీని అవమానకారంగా దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ భద్రతలను కాపాడడంలో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని.. తమ రాజకీయ ప్రయోజనాలకోసం చట్టసభ సభ్యునిగా ఉండి.. పోలీసు వ్యవస్థ అధిపతిని ఉద్దేశించి వ్యక్తిగత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చట్టప్రకారం తగిన చర్యలు కోరుతూ శాసనసభ స్పీకర్ పోచార శ్రీనివాస్ రెెడ్డికి విజ్ఞప్తి చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..