Batti Vikramarka: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి నాటకాలాడుతున్నాయి..పేపర్ లీక్ పై భట్టి సంచలన వ్యాఖ్యలు
ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కావడం.. అనంతరం పదవ తరగతి పరీక్ష పేపర్లు లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరికొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కావడం.. అనంతరం పదవ తరగతి పరీక్ష పేపర్లు లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరికొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆ రెండు పార్టీలను విమర్శించారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని..అందుకే ఈ లీకుల లొల్లిలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల సమస్యలను పక్కదోవ పట్టించానికే ఈ రెండు పార్టీలు నాటకాలడుతున్నాయని విమర్శించారు. మీడియా దృష్టి వారిపై పడేలా ఉండేందుకే కావాలనే ఈ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు.
గ్రూప్ 1 పేపర్ లీక్ వ్యవహారాన్ని చర్చకు రానివ్వకుండా.. లోతుగా దర్యాప్తు జరగకుండా చూసేందుకే ఈ రెండు పార్టీలు డైవర్షన్ రాజకీయ కుట్రలు చేస్తున్నాయని భట్టీ మండిపడ్డారు. అర్ధరాత్రి ఒంటి గంటకు బండి సంజయ్ వద్దకు వెళ్లి ఆయన్ని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో అసలు సమస్యలు బయటపడకుండా చేసేందుకే రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..