Telangana: జస్ట్ మిస్.. కొట్టుకునేంత పని చేశారు ఆ ఎమ్మెల్యేలు.. ఆధికారులు లేకపోతేనా?!
వాళ్ళు ప్రజాప్రతినిధులు.. కానీ జనం ముందే దాదాపు కొట్టుకున్నంత పనిచేశారు. ఒకే వేదికపై కూర్చొని అసహనానికి గురైన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరిపైకి మరొకరు దూసుకెళ్ళారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొని నువ్వెంతంటే నువ్వెంతంటూ..
వాళ్ళు ప్రజాప్రతినిధులు.. కానీ జనం ముందే దాదాపు కొట్టుకున్నంత పనిచేశారు. ఒకే వేదికపై కూర్చొని అసహనానికి గురైన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరిపైకి మరొకరు దూసుకెళ్ళారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొని నువ్వెంతంటే నువ్వెంతంటూ పైపైకి వెళ్ళారు. అధికారులు అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే గొడవ ఎందాకా వెళ్ళేదో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీనగరంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోఈ ఘర్షణ జరిగింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యల మధ్య మాటా మాటాపెరిగి రాద్ధాంతంగా మారింది. రేగా మాట్లాడుతుండగా అభ్యంతరం వ్యక్తం చేశారు వీరయ్య. ఇది ప్రభుత్వ కార్యక్రమమని ఇందులో బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ అడ్డుకున్నారు. దీంతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు.
‘మా ప్రభుత్వ ఘనతలను మేం కచ్చితంగా చెప్పుకుంటాం.. ఇదేమన్నా మీ ఏరియానా’ అంటూ రేగా కాంతారావు మండిపడ్డారు. ‘మీరు చేసిన పనులుంటే మీరు చెప్పుకోండి ఎవరొద్దన్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేగా కాంతారావు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..