U19 World Cup: అండర్ 19 ప్రపంచకప్ కు సిరిసిల్ల జిల్లా వాసి ఎంపిక.
హైదరాబాద్ జట్టు లో అండర్-14, అండర్-16 స్థాయిలో ఆడిన అవనిష్ రావు తన ప్రతిభతో అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవనీష్ ప్రతిభను గుర్తించి చాలెంజర్స్ టోర్నీకి ఎంపిక చేసింది. అలాగే ఇండియా అండర్ -19 'ఏ' జట్టులో అవనిష్ రావు బ్యాట్ మెన్, వికెట్ కీపర్ గా రాణించాడు. అత్యధిక పరుగులు సాధించి భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
ఇండియా అండర్-19 వరల్డ్ కప్ జట్టులో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ కు చెందిన క్రికెటర్ ఎరవెల్లి అవనీష్ రావు ఎంపికయ్యాడు. హైదరాబాద్ జట్టు లో అండర్-14, అండర్-16 స్థాయిలో ఆడిన అవనిష్ రావు తన ప్రతిభతో అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవనీష్ ప్రతిభను గుర్తించి చాలెంజర్స్ టోర్నీకి ఎంపిక చేసింది. అలాగే ఇండియా అండర్ -19 ‘ఏ’ జట్టులో అవనిష్ రావు బ్యాట్ మెన్, వికెట్ కీపర్ గా రాణించాడు. అత్యధిక పరుగులు సాధించి భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
ప్రస్తుతం దుబాయ్ లో ఆసియాకప్ లో ఆడుతున్న అవనిష్ దక్షిణాఫ్రికాలో డిసెంబర్ 19 నుంచి జరిగే ఇండియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ట్రై సిరీస్ కు ఎంపికయ్యాడు. అలాగే జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు. అవనిష్ తల్లిదండ్రులు లక్ష్మణ్ రావు, సుష్మ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ రావు తన కుమారుడు అండర్ 19 ఇండియా జట్టుకు ఎంపి కావడం వెనుక ఉన్న కష్టాన్ని వివరించారు.
తొమ్మిదేళ్ల నుంచే క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టి, ఆటు చదువుకుంటు ఇటు క్రికెట్ అడుతు బ్యాట్ మెన్, వికెట్ కీపర్ గా రాణిస్తూ ఇండియన్ టీమ్ సెలెక్టర్స్ దృష్టిలో పడి అండర్ 19 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేశారని అన్నాడు. కొడుకు సెలెక్ట్ కావడంతో కొడుకు ప్రతిభ చూసి సెలెక్ట్ చేసిన వారికి కృత్ఞతలు తెలిపాడు. తన కృషితోనే అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడని వివరించారు.