KCR: యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్.. పదేళ్ల తర్వాత అదే ఇంటికి..
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం 11 గంటలకు డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసానికి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు. అయితే ఈ నెల 7న ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్ లో కాలు జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే.

దీంతో వెంటనే ఆయనకు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రత్యేక వైద్యుల బృందం ఈనెల 8న సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసింది. అనంతరం ఆస్పత్రిలో కోలుకుంటున్న కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. దాదాపు ఐదు రోజుల పాటూ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు కేసీఆర్. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో గడిపారు. నిన్న సాయంత్రానికి ఆయన కోలుకుంటుండటంతో శుక్రవారం డిశ్చార్జి చేయాలని డాక్టర్లు నిర్ణయించారు.
14 ఏళ్ల ఉద్యమ సమయంలో నందినగర్‌లోని ఇంట్లోనే ఆయన నివాసం ఉన్నారు. ఇది ఆయన స్వగృహం. రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు ఇక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా కొన్ని రోజులు అక్కడి నుంచే పాలన సాగించారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో అనేక మంది అతిథులు వస్తూ పోతూ ఉండటం, చుట్టుపక్కల ఇండ్లలోని వారికి తీవ్ర అంతరాయం కలుగుతుండటం, ఆయనకు ఆ నివాసం సరిపోక.. అప్పటికే సిద్ధంగా ఉన్న సీఎం క్యాంప్ ఆఫీస్‌కి మారారు. ఆ తర్వాత రెండేళ్లకు కొత్తగా ప్రగతి భవన్‌ను నిర్మించి అందులోకి మకాం మార్చారు. కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ ఆయన కుటుంబం కూడా అక్కడే ఉండేవారు.
పూర్తి వీడియో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..