Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: రథసారధి ఆయనేనా.. పార్లమెంట్ ఎన్నికల వరకూ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగిస్తారా?

తెలంగాణ కాషాయ సారథిగా కిషన్ రెడ్డి కొనసాగనున్నారా? అధిష్టానం ఆలోచనేంటి ? అసెంబ్లీ ఎన్నికలపై సమీక్షలు చేసేదెవరు? ఇప్పుడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే..! ఒకవేళ అధ్యక్షుడిని మార్చితే, ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతుంది.

Telangana BJP: రథసారధి ఆయనేనా.. పార్లమెంట్ ఎన్నికల వరకూ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగిస్తారా?
Kishan Reddy,
Follow us
Sridhar Prasad

| Edited By: Balaraju Goud

Updated on: Dec 15, 2023 | 12:01 PM

తెలంగాణ కాషాయ సారథిగా కిషన్ రెడ్డి కొనసాగనున్నారా? అధిష్టానం ఆలోచనేంటి ? అసెంబ్లీ ఎన్నికలపై సమీక్షలు చేసేదెవరు? ఇప్పుడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే..! ఒకవేళ అధ్యక్షుడిని మార్చితే, ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతుంది. అయితే సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో కొత్తగా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కిషన్ రెడ్డినే కొనసాగించాలన ఓ వైపు అధిష్టానం యోచిస్తోందట.

త్వరలో పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీ అనుసరించే వ్యూహం ఏంటీ ? అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను పార్లమెంట్ ఎన్నికల నాటికి సరిచేసుకుంటారా ? లైట్ తీసుకుంటారా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డినే కొనసాగించాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. మరో రెండు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రానుంది. మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తవారిని నియమిస్తే సర్దుకోవడానికి సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి సారథ్యంలోనే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లే యోచనలో పార్టీ హైకమాండ్ ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ, ఈసారి మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పార్టీగా అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయించిన రీజనల్ రింగ్ రోడ్డు, రైల్వే, రోడ్ల అభివృద్ధిని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 15 వరకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర నేతల మధ్య ఆధిపత్యపోరుకు చెక్ పెట్టడానికి, అధిష్టానం ఆలోచనలు అమలు చేసేందుకు కిషన్ రెడ్డి నే పార్టీ రాష్ట్ర సారథిగా కొనసాగించాలని భావిస్తున్నారు.

దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. ఇక్కడ బీజేపీ అధిక పార్లమెంట్ సీట్లు గెలిచి, కాంగ్రెస్‌కు సవాల్ విసరాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు కమలనాథులు. పార్టీ అంటే నేనే అనే వారికి చెక్ పెట్టాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొత్త వారిని ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసింది. అదే తరహాలో పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహత్మకంగా కొన్ని స్థానాల్లో కొత్త ముఖాలను వెలుగులోకి తెచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాల నేపథ్యంలో బీసీలకు ఎక్కువ సీట్ల కేటాయింపు సూత్రాన్ని పక్కనపెట్టి గెలుపు గుర్రాలకే పార్లమెంట్ టికెట్లు కేటాయించే ఛాన్స్ ఉంది. అలాగే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిదాలపై పార్లమెంట్ సమావేశాల అనంతరం రాష్ట్ర స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో గెలుపు, ఓటములపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుని పార్లమెంట్ ఎన్నికలకు రెఢి కావాలని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. వారి లెక్కలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…