AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS Amrapali: తెలంగాణకు ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి.. కీలక పదవి ఇచ్చిన రేవంత్ సర్కార్..

యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, అనతి కాలంలో ప్రజా ఆదరణను చురగొన్న అధికారిణి కాట ఆమ్రపాలి సేవలను వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆమ్రపాలి.. సీఎం రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయడానికి అనుమతించాలని కోరారు. దీంతో ఆమెను కేంద్ర సర్వీసుల్లో నుంచి తెలంగాణకు రప్పించారు.

IAS Amrapali: తెలంగాణకు ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి.. కీలక పదవి ఇచ్చిన రేవంత్ సర్కార్..
Amrapali Smita Sabharwal
Shaik Madar Saheb
|

Updated on: Dec 14, 2023 | 7:52 PM

Share

యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, అనతి కాలంలో ప్రజా ఆదరణను చురగొన్న అధికారిణి కాట ఆమ్రపాలి సేవలను వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆమ్రపాలి.. సీఎం రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయడానికి అనుమతించాలని కోరారు. దీంతో ఆమెను కేంద్ర సర్వీసుల్లో నుంచి తెలంగాణకు రప్పించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) జాయింట్ కమిషనర్‌గా, మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

అంతేకాకుండా.. తెలంగాణ ప్రభుత్వం.. పలువురు ఐఏఎస్‌ అధికారులను కూడా బదిలీ చేసింది. రాష్ట్రంలోని పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను గురువారం బదిలీ చేయడంతోపాటు.. పలువురికి కొత్త బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రికల్చర్ డైరెక్టర్‌గా బి.గోపి, ట్రాన్స్‌కో, జెన్‌కో ఛైర్మన్‌ అండ్‌ ఎండీగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, డిప్యూటీ సీఎం ఓఎస్‌డీగా ఐఏఎస్ కృష్ణభాస్కర్‌, ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా ముషారఫ్ అలీ, ఆరోగ్య శాఖ కమిషనర్‌గా శైలజా రామయ్యర్, ట్రాన్స్‌కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీగా వరుణ్‌రెడ్డిని నియమించింది.

తెలంగాణలోనే.. స్మితా సబర్వాల్..

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కూడా కరీంనగర్, మెదక్ జిల్లాల్లో అనతి కాలంలో విశేష ఆదరణ పొందారు. ఆమె ప్రతిభను చూసి మాజీ సీఎం కేసీఆర్.. సీఎం సెక్రెటరీగా నియమించుకున్నారు. దీనితోపాటు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, కేసీఆర్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన స్మితా సబర్వాల్ కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత పెద్దగా బయటకు కనిపించలేదు. కొత్త సీఎంను అధికారులు మర్యాదపూర్వకంగా కలుసినా.. స్మితా సబర్వాల్ మాత్రం కలవలేదు. దీంతో ఆమె డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లుతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో స్మితా సబర్వాల్.. తాను తెలంగాణ కోసం పని చేస్తానని, తనకు ఏ బాధ్యత అప్పగించినా చేస్తానంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు. అంతేకాకుండా.. తెలంగాణ పంచాయతీ రాజ్ మంత్రి సీతక్కను స్మితా సబర్వాల్ కలిసి.. సన్మానించారు. ఈ తరుణంలో స్మిత సబర్వాల్ కు కూడా కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..