Telangana: మావోయిస్టు రహిత తెలంగాణే టార్గెట్.. డీజీపీ మహేందర్‌రెడ్డి మాస్టర్ ప్లానేంటి..?
తెలంగాణలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏజెన్సీ ఏరియాలో మావోయిస్టుల కదలికలు పెరగడంతో అంతరాష్ట్ర బలగాలను మరింత అలెర్ట్ చేశారు. CASF, గ్రేహాండ్స్, SIB, జిల్లా పోలీసులు..
తెలంగాణలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏజెన్సీ ఏరియాలో మావోయిస్టుల కదలికలు పెరగడంతో అంతరాష్ట్ర బలగాలను మరింత అలెర్ట్ చేశారు. CASF, గ్రేహాండ్స్, SIB, జిల్లా పోలీసులు అంతా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన పూసుగుప్పలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటించారు. భద్రతా బలగాల కోసం క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. వీలైనంత త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఆ తర్వాత పూసుగుప్ప నుండి హెలికాప్టర్ ద్వారా ములుగుజిల్లా వెంకటాపురం చేరుకున్నారు. అక్కడ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాద్‌జిల్లాల ఎస్పీలతో పాటు ఇతర పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
అంతరాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల అలజడితో జాయింట్ ఆపరేషన్ చేపట్టామన్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి. మావోయిస్టు పార్టీలో ఉన్న 130 మంది తెలంగాణవారు ఉన్నారని..వారంతా లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు డీజీపీ. మొత్తానికి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ వారి కార్యకలాపాలను నిరోధిస్తున్న పోలీసుల పనితీరును డీజీపీ ప్రశంసించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..