Amit Shah: బీజేపీ ఆపరేషన్ షురూ..! తెలంగాణ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ.. టార్గెట్ అదేనా..
మిషన్ 90- ఆపరేషన్ 2023.. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ ప్రోగ్రామ్‌లు ఉన్నా సరే.. అత్యవసరంగా రావాలంటూ వచ్చిన పిలుపుతో హస్తినకు వెళ్లారు రాష్ట్ర నేతలు.
మిషన్ 90- ఆపరేషన్ 2023.. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ ప్రోగ్రామ్‌లు ఉన్నా సరే.. అత్యవసరంగా రావాలంటూ వచ్చిన పిలుపుతో హస్తినకు వెళ్లారు రాష్ట్ర నేతలు. మరికాసేపట్లో అమిత్‌షా తెలంగాణలోని కీలక నేతలతో భేటీ కానున్నారు. రాబోయే పది నెలలకు.. అంటే ఎన్నికలు అయ్యే వరకు ఏం చేయాలి, ఎలా గెలవాలన్న దానిపై రాష్ట్ర నేతలకు డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు అమిత్ షా.. మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల, వివేక్, జితేందర్ రెడ్డి తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. మిషన్ 90, తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల ప్రణాళిక పై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రణాళికలను రచించింది. మిషన్ 90 పేరుతో 10 నెలలకు కావాల్సిన రోడ్‌మ్యాప్, నియోజకవర్గాల వారీగా సమావేశాల గురించి పలు సూచనలు చేసింది. ఈ యాక్షన్ ప్లాన్ అమలు తీరుతో పాటు.. అమిత్ పలు కీలక అంశాలను చర్చించి తెలంగాణ నాయకత్వానికి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.
కాగా, అధిష్టానం నుంచి పిలుపు రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సహా కీలక నేతలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ విస్తరణ, నేతల మధ్య ఏకాభిప్రాయం సహా పలు అంశాల గురించి చర్చించనునున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..