AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరుగులు.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..

కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. రెండు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. ఈ నేపథ్యంలో మంగళవారం నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను మంగళవారం ఎత్తారు. 18 ఏళ్ల తర్వాత జులై నెలలో నాగర్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు.

Shaik Madar Saheb
|

Updated on: Jul 29, 2025 | 12:53 PM

Share

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. రెండు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. ఈ నేపథ్యంలో మంగళవారం నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను మంగళవారం ఎత్తారు. 18 ఏళ్ల తర్వాత నాగర్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు. నాగార్జునసాగర్ గేట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సాగర్ ఎమ్మెల్యే రఘువీర్‌రెడ్డి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

కాగా.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది.. ఇన్‌ఫ్లో 2,01,743, ఔట్‌ఫ్లో 41,985 క్యూసెక్కులు ఉంది.. ప్రస్తుత నీటిమట్టం 586.40 అడుగులు ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి జూలైలో క్రస్ట్ గేట్లు తెరుచునున్నాయి..

క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. సాగర్ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు నాగర్జున సాగర్‌కు భారీగా క్యూ కడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్