AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Leopard: ట్రాక్‌ కెమెరాకు చిక్కిన చిరుత… హైదరాబాద్‌ శివారులో భయం భయం

హైదరాబాద్‌ శివారులో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. ఎక్కడి నుంచి ఏ చిరుత దాడి చేస్తుందనే భయం వెంటాడుతోంది. 20 రోజుల్లో మూడు కీలక ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని గుర్తించారు. గోల్కొండ పరిసరాల్లో మళ్లీ చిరుత కనిపించింది. రాందేవ్ గూడలో మిలటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటింది. టిక్ పార్క్ నుంచి...

Hyderabad Leopard: ట్రాక్‌ కెమెరాకు చిక్కిన చిరుత... హైదరాబాద్‌ శివారులో భయం భయం
Leopard Hyderabad
K Sammaiah
|

Updated on: Jul 29, 2025 | 12:05 PM

Share

హైదరాబాద్‌ శివారులో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. ఎక్కడి నుంచి ఏ చిరుత దాడి చేస్తుందనే భయం వెంటాడుతోంది. 20 రోజుల్లో మూడు కీలక ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని గుర్తించారు. గోల్కొండ పరిసరాల్లో మళ్లీ చిరుత కనిపించింది. రాందేవ్ గూడలో మిలటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటింది. టిక్ పార్క్ నుంచి మిలటరీ ఏరియాలోకి వెళ్లింది చిరుత. తెల్లవారుజామున తిరిగి టెక్ పార్క్ లోకి చిరుత వెళ్లినట్లు ట్రాక్‌ కెమారాలో దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి.

చిరుత సంచరిస్తుండడంతో మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగి గూడ, గంధంగూడ, నెక్నామ్ పూర్, ఇబ్రహీంబాగ్, రాందేవ్ గూడ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అయితే.. చిరుతను బంధించేందుకు బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు అటవీశాఖ అధికారులు. అటవీ ప్రాంతంలో తప్ప జనావాసాల్లోకి చిరుత రావడం లేదని.. చెప్పారు. చిరుతపై నిఘా ఉంచామని, స్పెషల్ టీమ్స్ చిరుత కోసం వెతుకుతున్నాయని చెబుతున్నారు.

జూలై 24న గండిపేట గ్రేహౌండ్స్‌ ట్రైనింగ్ సెంటర్‌లో చిరుత కనిపించింది. అంతకుముందు 11న బాలాపూర్ డిఫెన్స్‌ లేబొరెటరీస్‌లో రెండు చిరుతలు కనిపించాయి. హైదరాబాద్‌ శివారుల్లో చిరుతలు తరచూ కనిపిస్తున్నాయి. కనిపించడం కాదు.. బెంబేలెత్తిస్తున్నాయి. పైగా.. అన్నీ కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో నడిచే డిఫెన్స్‌ సంబంధిత సంస్థల్లోనో, ఆ సమీపంలోనో ప్రత్యక్షమవడం ఆసక్తికరంగా మారింది.

సోమవారం గోల్కొండలోని మిలటరీ క్యాంప్ దగ్గర ఇబ్రహీంబాగ్‌లో రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. బైక్‌పై ఓ వెళ్తున్న ఓ వ్యక్తి దాన్ని గుర్తించి అటవీశాఖకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ ఏరియా పబ్లిక్‌లో వణుకుమొదలైంది. 20రోజులుగా శివారుల్లో చిరుతలు తరచూ కనిపిస్తున్నాయి. నాలుగురోజుల క్రితం గండిపేట సమీపంలోని గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌లో ఓ చిరుత కనిపించింది. దాన్ని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు పెట్టినా ఇంతవరకూ దాని జాడ లేదు. ఇప్పుడు గోల్కొండలో కనిపించిన చిరుత అదేనా, ఇది వేరేనా.. అన్నది తేలాల్సి ఉంది.

ఇక ఈ నెల 11న బాలాపూర్‌లోని APJ కలాం డిఫెన్స్ లేబొరెటొరీస్ రీసెర్చ్ సెంటర్‌లో ఒకటి కాదు.. రెండు చిరుతలు కనిపించాయి. ఈ ప్రాంతాలన్నీ రక్షణరంగానికి సంబంధించిన ప్రాంతాలు. సహజంగా అక్కడ ఎక్కువగా అటవీస్థలం ఉంటుంది. కాబట్టి.. 60కిలోమీటర్ల రేంజ్‌లో సంచరించే చిరుతలు ఒకటీ రెండేనా.. ఇంకా ఉన్నాయా అన్న భయంతో పబ్లిక్ వణికిపోతున్నారు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..