AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNVST 2026 Application: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్‌!

ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లు ఉన్నాయి. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు వీటిల్లో ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులు మరి కొన్ని గంటల్లోనే..

JNVST 2026 Application: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్‌!
Navodaya Vidyalaya Application
Srilakshmi C
|

Updated on: Aug 11, 2025 | 11:31 PM

Share

దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 654 జవహర్‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్‌ దరఖాస్తులు మరి కొన్ని గంటల్లోనే ముగియనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జవహర్‌ నవోదయ విద్యాలయ సంస్థ తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న బాల బాలికలు ఎవరైనా నవోదయలో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ దరఖాస్తులు జులై 29, 2025 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జవహర్‌ నవోదయ విద్యాలయ విద్యాసంస్థల్లో 6వ తరగతి ప్రవేశాల అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లు ఉన్నాయి. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు వీటిల్లో ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. అలాగే బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కూడా కల్పించారు. జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2026 ద్వారా సీట్లు కల్పిస్తారు. అయితే దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. నవోదయ విద్యాలయాల్లో గ్రామీణ ప్రాంతాలకు విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. విద్యార్థులు జనవరి 1, 2014 నుంచి జులై 31, 2016 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఈ రోజు ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రవేశ పరీక్ష డిసెంబర్‌ 13, 2025వ తేదీన నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13న ఉదయం 11.30 గంటలకు, జమ్మూ కశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 11న ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలు 2026 మార్చిలో విడుదల చేస్తారు.

ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుందంటే..

జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్ష మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ఉంటుంది. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మెంటల్‌ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్‌, లాంగ్వేజ్‌.. నుంచి ప్రశ్నలు వస్తాయి. తెలుగుతోపాటు ఆంగ్లం, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ వంట ఇతన మాధ్యమాల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే