AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karate Kalyani: కరాటె కళ్యాణికి ‘మా’ జలక్‌.. సభ్యత్వం నుంచి తొలగిస్తూ నిర్ణయం.

నటి కరాటె కళ్యాణికి 'మా అసోసియేషన్' జలక్‌ ఇచ్చింది. మా అసోసియేషన్‌ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కరాటె కళ్యాణిని మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. సీనియర్‌ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ మా అసోసియేషన్‌ ఈ నెల 16వ తేదీన షోకాజ్‌ నోటీసులు..

Karate Kalyani: కరాటె కళ్యాణికి 'మా' జలక్‌.. సభ్యత్వం నుంచి తొలగిస్తూ నిర్ణయం.
Karate Kalyani
Narender Vaitla
|

Updated on: May 25, 2023 | 6:06 PM

Share

నటి కరాటె కళ్యాణికి ‘మా అసోసియేషన్’ జలక్‌ ఇచ్చింది. మా అసోసియేషన్‌ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కరాటె కళ్యాణిని మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. సీనియర్‌ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ మా అసోసియేషన్‌ ఈ నెల 16వ తేదీన షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై ఇప్పటివరకు కళ్యాణి స్పందించకపోవడంతో మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణిని సస్పెండ్ చేసినట్లు మా సభ్యులు తెలిపారు.

‘ఈ నెల 16 వ తేదీన మేము పంపిన షోకాజ్ నోటీసుకు నిర్ణీత సమయంలోగా వివరణను ఫైల్ చేయడంలో మీరు విఫలం చెందారు. ఆ తరువాత లీగల్ నోటీసులు జారీ చేయగా .. వాటికి కూడా సమాధానం చెప్పకపోవడం మా సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. దీనిపై మా అసోసియేషన్ నేడు చర్చించి తక్షణమే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది’ అంటూ కరాటే కళ్యాణికి ఇచ్చిన నోటీసులో ప్రస్తావించారు. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే సీనియర్‌ ఎన్టీఆర్‌ శత శయంతి సందర్భంగా ఖ్మంలో 54 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ విగ్రహం కృష్ణుడి రూపాన్ని పోలి ఉందని కరాటె కళ్యాణి కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి తీర్పునిచ్చే వరకు విగ్రహావిష్కరణను ఆపాలని కోర్టు స్టే విధించింది. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్నారైలు విగ్రహంలో స్వల్ప మార్పులు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. మే 28వ తేదీన ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌ హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..