AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈ ప్రాంతం మరో హైటెక్‌ సిటీ అవ్వడం ఖాయం..

హైదరాబాద్ మహా నగంలో ఇల్లు కొనుగొలు చేయాలనేది సగటు సామాన్యుడి కోరిక. అందుకే ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందా.? ఎక్కడ కొనుగొలు చేస్తే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని అన్వేషిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఈ వార్త. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి హైదరాబాద్‌ తూర్పు ఇప్పుడు బెస్ట్‌ ఆప్షన్‌గా..

Hyderabad: హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈ ప్రాంతం మరో హైటెక్‌ సిటీ అవ్వడం ఖాయం..
Hyderabad
Narender Vaitla
|

Updated on: May 25, 2023 | 5:15 PM

Share

హైదరాబాద్ మహా నగంలో ఇల్లు కొనుగొలు చేయాలనేది సగటు సామాన్యుడి కోరిక. అందుకే ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందా.? ఎక్కడ కొనుగొలు చేస్తే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని అన్వేషిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఈ వార్త. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి హైదరాబాద్‌ తూర్పు ఇప్పుడు బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో తీసుకొస్తున్న లుక్‌ ఈస్ట్‌ పాలసీ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కి కొత్త డెస్టినేషన్‌ను చూపిస్తోంది. తూర్పు హైదరాబాద్‌ ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌కి చిరునామాగా మారుతోంది.

ప్రముఖ రియల్ ఎస్టేట్‌ సంస్థ నో బ్రోకర్‌ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తూర్పు హైదరాబాద్‌ టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ వంటి ఎన్నో దిగ్గజ ఐటీ కంపెనీలకు కేరాఫ్‌గా మారింది. దీంతో పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా అనే ఫార్మా కంపెనీలు కూడా ఈ ప్రాంతానికి క్యూ కడుతున్నాయి. అలాగే ఫేజ్‌ 1లో 14,00 ఎకరాలు, ఫేజ్‌ 2లో 5000 ఎకరాలతో కూడిన అభివృద్ధి కార్యచరణకు ప్రభుత్వం సైతం మొగ్గు చూపుతోంది. భవిష్యత్తులో రానున్న పెట్టుబడులతో ఏకంగా 3.5 లక్షల ఉద్యోగాలు రానున్నాయని అంచనా వేస్తున్నారు.

గతేడాదితో పోలిస్తే ఈ ప్రాంతంలో ప్రాపర్టీలను కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య ఏకంగా 91 శాతం పెరిగినట్లు నో బ్రోకర్‌ తెలిపింది. ముఖ్యంగా ఉప్పల్‌, నాగోల్‌, ఎల్‌బీ నగర్‌, పోచారం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే 50కిపైగా కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. ఎక్కువ ఆదాయం ఉన్న వారు ఈ ప్రాంతాల్లో వాణిజ్య పరమైన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కమర్షియల్‌ ల్యాండ్‌ కొనుగోల్లలో 80 శాతం పెరుగుదల కనిపించినట్లు నో బ్రోకర్‌ పేర్కొంది. ఎక్కువ ఆదాయం ఉన్న వర్గాలు.. క్లినిక్‌లు, షోరూమ్స్‌, రెస్టారంట్‌ వంటి భవనాల్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లు నో బ్రోకర్‌.కామ్‌ సీఈఓ అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..