Sathupalli: వాటే స్కెచ్.. మహిళ మాస్టర్ ప్లాన్‌కు అవాక్కయిన పోలీసులు.. పూల మొక్కల మధ్యలో
గంజాయి కోసం మన్యంలోని వనంకు వెళ్లాలా..? ఇప్పుడసలే పోలీసులు టెన్టన్ ఎక్కువైంది. ఇక్కడే పెరట్లో పెంచితే పోలా..? దాన్నే అమలు పరిచింది ఓ మహిళ. వాసన గుప్పుమనే సరికి పక్కింటోళ్లకి అనుమానం రావడంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఏకంగా ఇంట్లోనే గంజాయి మొక్కలు సాగు చేస్తున్న విషయాన్ని చూసి ఖాకీలే షాకయ్యారు.

తెలంగాణలో గంజాయిని రూపుమాపేందుకు పోలీస్ శాఖ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న స్మగ్లర్లు మాత్రం మారడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో కొన్ని ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సరఫరా చేస్తునే ఉన్నారు. అయితే.. వారి ఎత్తుగడలకు తగ్గట్లే పోలీసులు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా.. ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు పోలీసులు. దీంతో కొందరు ఈ మధ్య కాలంలో ఇళ్లల్లోనే గంజాయి పెంపకం చేపడుతున్నారు. అలాంటి ఘటనలు ఇటీవల తరచుగా వెలుగుచూశాయి. తాజాగా సత్తుపల్లి మండలం చంద్రాయ పాలెం గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను గుర్తించారు ఎక్సైజ్ అధికారులు.
యట్టగాని సుధ అనే మహిళ ఇంటి ఆవరణలో ఏపుగా పెరిగిన 4 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. పూల మొక్కలు చాటున సదరు మహిళ గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమెపై బైండోవర్ కేసు నమోదు చేశారు. అయితే ఆ మహిళ మాత్రం తనకేం పాపం తెలియదని చెబుతుంది. తాను పూల మొక్కలు మాత్రమే వేశానని.. అవి ఎలా వచ్చాయో తనకు తెలియదు అంటుంది. అయితే ఆమెవి కట్టుకథలని.. విచారణలో అసలైన నిజం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు.
ఈ తరహా కల్చర్ తెలంగాణకు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. గంజాయి మొక్కలు పెంచినా , సాగు చేసినా, ఇంట్లో ఉంచుకున్న నేరమే అంటున్నారు. సో…బీకేర్‌ఫుల్..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
