Telangana: సంపు వద్ద స్నానం చేస్తున్న 14 ఏళ్ల బాలుడు.. కులం పేరిట మహిళ దూషణ! ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఓ మహిళ షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందిన బాలుడిని నలుగురిలో కులం పేరిట తిట్టిపోసింది. దీంతో అవమానంగా భావించిన సదరు బాలుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో సోమవారం (జూన్ 9) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

కొండాపూర్, జూన్ 11: కుల దూషణ నేరం. కూలం పేరిట తిట్టిన, కొట్టినా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని భారతీయ శిక్షా స్మృతులు చెబుతున్నాయి. అందులోనూ అభంశుభం తెలియని పసివాళ్లను కూలం పేరిట అవమానించడం క్షమించరాని నేరం. అయితే తాజాగా ఓ మహిళ షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందిన బాలుడిని నలుగురిలో కులం పేరిట తిట్టిపోసింది. దీంతో అవమానంగా భావించిన సదరు బాలుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో సోమవారం (జూన్ 9) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల శ్రీకాంత్ అనే బాలుడు వేసవి సెలవుల కోసం తన అమ్మమ్మ గారింటికి వచ్చాడు. అయితే స్థానికంగా కొమురమ్మ అనే మహిళ బాలుడిని గొర్రెలను వధించడానికి, మాంసం ముక్కలుగా కోయడానికి సహాయం చేయమని కోరింది. దీంతో శ్రీకాంత్ ఆమెకు సహాయం చేసిన అనంతరం స్నానం చేసేంందుకు కుమురమ్మ బంధువు ఇంటి వద్ద చిన్న నీటి సంపు వద్దకు వెళ్లాడు. శ్రీకాంత్ అక్కడ స్నానం చేస్తుండగా.. ఆగ్రహించిన కొమురమ్మ బాలుడిని తిట్టి, కొట్టింది. దీంతో బాలుడు శ్రీకాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శ్రీకాంత్ షెడ్యూల్డ్ తెగల (యానాది) వర్గానికి చెందినవాడు.
అవమానంగా భావించిన బాలుడు ఇంటికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ బిడ్డ మరణానికి కుల వివక్షే ప్రధాన కారణమని ఆరోపిస్తూ బాలుడి తల్లిదండ్రులు రమేష్, లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొమురమ్మ మాత్రం బాలుడిని తిట్టానని, తాను కొట్టలేదని చెప్పింది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు నల్లబెల్లి SI గోవర్ధన్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.