AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honeymoon Murder: ‘నా భర్తను చంపేయ్‌.. నేను విధవగా మారి నిన్ను పెళ్లి చేసుకుంటా’ హనీమూన్‌ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు!

ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి మరీ భర్తను హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ వ్యవహారం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. హనీమూన్ కోసం మధ్యప్రదేశ్ నుంచి భర్త రాజా రఘువంశీతో కలిసి కలిసి సోనమ్ రఘువంశీ మేఘాలయకు వెళ్లింది. అక్కడే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసి.. హత్య చేసింది. ఆ తర్వాత సోనమ్ కనిపించకుండా పోయింది. ఈ వ్యవహారంలో మొత్తం స్టోరీని పోలీసులు వెలికి తీశారు..

Honeymoon Murder: 'నా భర్తను చంపేయ్‌.. నేను విధవగా మారి నిన్ను పెళ్లి చేసుకుంటా' హనీమూన్‌ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు!
Honeymoon Murder Story
Srilakshmi C
|

Updated on: Jun 10, 2025 | 12:12 PM

Share

ఇండోర్, జూన్‌ 10: మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్‌ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హత్యకు కుట్ర పన్నింది భార్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసులో సోనమ్ రఘువంశీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెను మేఘాలయకు తరలించారు. అనంతరం పోలీసులు ఆమెను పాట్నాకు తరలించి అక్కడి పుల్వారీ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు పాట్నా నుంచి గౌహతికి విమానంలో తరలించనున్నారు. అనంతరం గౌహతి నుంచి మేఘాలయకు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి మరీ భర్తను హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ వ్యవహారం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. హనీమూన్ కోసం మధ్యప్రదేశ్ నుంచి భర్త రాజా రఘువంశీతో కలిసి కలిసి సోనమ్ రఘువంశీ మేఘాలయకు వెళ్లింది. అక్కడే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసి.. హత్య చేసింది. ఆ తర్వాత సోనమ్ కనిపించకుండా పోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు రాజా రఘువంశీ మృతదేహం లభించింది. టూరిస్ట్ గైడ్, హోటల్ సీసీటీవీ ఫుటేజి, ఫోన్ కాల్ డాటా ఆధారంగా మేఘాలయ, మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే తాను అమాయకురాలినని, తననే ఎవరో కిడ్నాప్ చేశారని సోనమ్ తొలుత బుకాయించింది. కానీ పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటకు రావడంతో నేరం అంగీకరించింది.

భర్త మర్డర్‌కు పెళ్లైన ఐదో రోజు నుంచే స్కెచ్‌ ..

ఇందోర్‌కు చెందిన ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీ–సోనమ్ పెళ్లి మే 11న జరిగింది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. పెళ్లయిన ఐదు రోజే అంటే మే 16న సోనమ్ తన ప్రేమికుడు రాజ్ కుశ్వాహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. ‘రాజాను చంపేద్దాం.. కిడ్నాప్ నాటకం చేద్దాం. అప్పటికి నేను విదవగా మారుతాను. నాన్న కూడా మన పెళ్లికి అంగీకరిస్తారు’ అని సోనమ్ తన ప్రియుడు రాజ్‌తో చెప్పిందట. భర్తను హత్య చేసిన కత్తి (డావ్) గువాహటిలోంచి ఆన్‌లైన్ ద్వారా తెప్పించారు. సంఘటనకు ముందు నిందితులు సోనమ్ హోం స్టేకు 1 కి.మీ దూరంలోని హోటల్లో బస చేశారు. వారికి లొకేషన్ పంపించింది కూడా సోనమే.

ఇవి కూడా చదవండి

మే 23న ఫోటోషూట్ నెపంతో సోనమ్, రాజాను ఒంటరిగా ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్లింది. అదును చూసి చంపేయండి అని అరవడంతో.. అక్కడే ఉన్న ముగ్గురు యువకులు రాజా రఘువంశీని హత్య చేశారు. తర్వాత నిందితుడు విశాల్ చౌహాన్ రాజా తలపై కత్తితో గాయపరిచాడు. మరో నిందితుడు ఆకాశ్ రాజ్‌పుత్ దూరం నుంచి బైక్ మీద ఉండి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. మొదట నిందితులు ఈ పని చేయడానికి ఒప్పుకోలేదు. కానీ సోనమ్ రూ.20 లక్షలు ఇస్తానని ఆశ చూపడంతో అంగీకరించారు. మే 23న హత్య చేసిన అనంతరం అదే రోజు శిలాంగ్ నుంచి గువాహటికి వెళ్లిన సోనమ్, అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వారణాసి మీదుగా గాజీపూర్‌కు వెళ్లింది. దారి మధ్యలో తన మొబైల్ ఫోన్‌లను కూడా ధ్వంసం చేసింది. అయితే పోలీసుల విచారణలో సోనమ్ సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. అందులో ఆమె నిందితులతో మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నట్లు తేలింది. తర్వాత CDR, కాల్ ట్రేసింగ్ ఆధారంగా రాజ్ కుశ్వాహా స్థానికంగా ఉన్నట్లు తెలిసింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోనమ్ తన ‘గేమ్’ ముగిసిందని అర్థం చేసుకుని, ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఢాబాలోకి వెళ్లి లొంగిపోయింది. హత్యకు కుట్ర పన్నిన రాజ్ కుశ్వాహానే, రాజా అంత్యక్రియలో స్వయంగా పాల్గొని తతంగం జరిపించాడు. మృతుడి మామ దవీ సింగ్‌ ఓదారుస్తూ ఉండటం వీడియోల్లో కనిపించింది. ఇందులో అతడు తీవ్ర భావోద్వేగంలో ఉన్నట్లు కనిపించడం మరో విశేషం. రాజా రఘువంశీని కిరాతకంగా హత్య చేసిన రాజ్ కుశ్వాహా.. అంత్యక్రియలు జరిపించిన విషయం తెలిసి బంధువులు దిగ్ర్భాంతికి గురైనారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us