Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biological Smuggling: చైనా దిగజారుడు చర్యలు.. అమెరికాలో మరో బయోవెపన్‌ స్మగ్లర్‌ అరెస్ట్!

ఇటీవల కాలంలో అమెరికాకు బయోలాజికల్‌ గూడ్స్‌ స్మగింగ్‌ చేస్తూ చైనాకు చెందిన ఇద్దరు వ్యక్తులు పట్టుబడిన సంగతి తెలిసిందే. గత వారం మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు యుంకింగ్ జియాన్, ఆమె ప్రియుడు జున్యోంగ్ లియు.. వ్యవసాయ పంటలను నాశనం చేసే ప్రమాదకరమైన ఫంగస్‌ను యుఎస్‌లోకి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు. తాజాగా చైనాకు చెందిన మరో PhD విద్యార్ధిని బయో వెపన్స్ అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడింది..

Biological Smuggling: చైనా దిగజారుడు చర్యలు.. అమెరికాలో మరో బయోవెపన్‌ స్మగ్లర్‌ అరెస్ట్!
Biological Smuggling
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 10, 2025 | 9:54 AM

బయోలాజికల్‌ వెపన్స్‌ అక్రమంగా రవాణా చేస్తున్న చైనా దేశానికి చెందిన మరో స్మగ్లర్‌ను పోలీసులు ఆదివారం (జూన్‌ 8) అరెస్ట్ చేశారు. నిందితుడిని చైనాకు చెందిన PhD విద్యార్థి చెంగ్క్సువాన్ హాన్‌గా గుర్తించారు. ఈ మేరకు అమెరికాలో అతడిని అరెస్టు చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. వుహాన్‌లోని హువాజోంగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలో రీసెర్చ్‌ స్టూడెంట్‌ చెంగ్క్సువాన్ హాన్‌ను జూన్ 8న డెట్రాయిట్ మెట్రోపాలిటన్ విమానాశ్రయంలో FBI అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోకి బయోలాజికల్‌ వెపన్స్‌ అక్రమంగా రవాణా చేయడంతోపాటు తప్పుడు ప్రకటనలు చేయడం.. అనే రెండూ అభియోగాలు హాన్‌పై మోపారు. డెట్రాయిట్‌లో యుఎస్‌లోకి బయోలాజికల్ మెటీరియల్‌లను అక్రమంగా రవాణా చేసి, ఫెడరల్ ఏజెంట్లకు అబద్ధం చెప్పిన ఆరోపణలపై రెండో చైనా జాతీయురాలిని అరెస్టు చేసినట్లు ఎక్స్‌లో FBI డైరెక్టర్ కాష్ పటేల్ ట్వీట్‌ చేశారు. నిందితురాలు చెంగ్క్సువాన్ హాన్.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పౌరురాలని, చైనాలోని వుహాన్‌కి చెందిన పీహెచ్‌డీ విద్యార్థినిగా అందులో తెలిపారు.

చైనాలోని మిచిగాన్ యూనివర్సిటీ ల్యాబ్‌ నుంచి నాలుగు ప్యాకేజీలను హాన్‌ తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ప్యాకేజీలో రౌండ్‌వార్మ్‌లకు సంబంధించిన జీవసంబంధమైన పదార్థాలు ఉన్నాయి. ప్యాకేజీలలో ఒక దానిలోపల ఓ పుస్తకం దాచి ఉంది. నిందితురాలు హాన్‌ డెట్రాయిట్‌లో దిగిన తర్వాత.. సదరు ప్యాకేజీల గురించి తనకు తెలియదని బుకాయించింది. అంతేకాకుండా హాన్ అమెరికాకు రావడానికి కొన్ని రోజుల ముందు ఆమె ఎలక్ట్రానిక్ పరికరాల్లోని డేటాను తొలగించినట్లు గుర్తించారు. దర్యాప్తును అడ్డుకోవడానికి ఉద్దేశపూర్వక సైంటిస్టులు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే దర్యాప్తులో మాత్రం సదరు ప్యాకేజీలు తనవేనని నిజం అంగీకరించింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP)తో సంబంధాలు ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా US విద్యాసంస్థలలోని చైనా జాతీయులు ఈ బయోలాజికల్ స్మగ్లింగ్‌లో సంబంధం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

కాగా ఇటీవల కాలంలో ఈ విధమైన బయోలాజికల్‌ గూడ్స్‌ స్మగింగ్‌ చేస్తూ పట్టుబడిన వారిలో చెనాకు చెందిన మూడో వ్యక్తి హాన్‌ కావడం విశేషం. గత వారం మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు యుంకింగ్ జియాన్, ఆమె ప్రియుడు జున్యోంగ్ లియు.. వ్యవసాయ పంటలను నాశనం చేసే ప్రమాదకరమైన ఫంగస్‌ను యుఎస్‌లోకి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఇది అమెరికా ఆహార సరఫరాపై దాడిగా FBI భావించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.