Rajendranagar Murder Case: రాజేంద్రనగర్ వృద్ధ దంపతుల హత్య కేసులో వీడిన మిస్టరీ.. పగతోనే దారుణం!
నగరంలో కలకలం రేపిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అవమానించారన్న కారణంలో వృద్ధ దంపతుల ప్రాణాలను నిలువునా తీసినట్లు నిందితుడు అంగీకరించాడు. రాజేంద్రనగర్ పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడి కోసం పోలీస్ బృంధాలు గాలిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..

ఆదిలాబాద్, జూన్ 10: రాజేంద్రనగర్ వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అవమానించారన్న కారణంలో వృద్ధ దంపతుల ప్రాణాలను నిలువునా తీసినట్లు నిందితుడు అంగీకరించాడు. రాజేంద్రనగర్ పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడి కోసం పోలీస్ బృంధాలు గాలిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
రాజేంద్రనగర్ సర్కిల్ జనచైతన్య వెంచర్ పేస్2లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వృద్ధ దంపతులు జూన్ 5న గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు అపార్ట్‌మెంట్ సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలించారు. అందులో బహదూర్‌పురా నుంచి రాజేంద్రనగర్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు వృద్ధ జంటను హత్య చేసి, తిరిగి అదే మార్గంలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు మెదక్ పారిపోయినట్లు తెలుసుకుని ఆదివారం రాత్రి అక్కడ ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.
వృద్ధ దంపతుల పాత డ్రైవరే ఈ జంట హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిని డ్రైవర్ సల్మాన్ గా పోలీసులు గుర్తించగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈనెల 5న జన చైతన్య ఫేస్ 2లో వృద్ధ దంపతులైన అబ్దుల్లా (77), రిజ్వానా (70)ను హత్య చేసిన తెలిపాడు. తాను డ్రైవర్‌గా రెండుళ్లు పనిచేశానని, తాను పనిచేసే రోజుల్లో అబ్దుల్లా, రిజ్వానా చీటికిమాటికి తిట్టేవారని, 10 నెలల క్రితం డ్రైవర్ తనను పనిలో నుంచి తీసివేసినట్లు తెలిపాడు. అందుకే పగ తీర్చుకోవడానికి దంపతులను హత్య చేసినట్లు సల్మాన్ అంగీకరించాడు. పథకం ప్రకారమే ఈనెల ఐదున మరొకరితో కలిసి వృద్ధ దంపతుల ఇంటికి డ్రైవర్ సల్మాన్ వచ్చారు. వీరిలో ఒక వ్యక్తి మాస్క్, క్యాప్ పెట్టుకొని ఉండగా.. మరొకరు బురక ధరించి వచ్చారు. ఫిజియోథెరపీ చేస్తామని ఇంట్లోకి ప్రవేశించి దంపతులను కత్తితో పొడిచి హత్య చేసినట్లు డ్రైవర్ సల్మాన్ తెలిపాడు. హత్య అనంతరం వీరిద్దరూ వేర్వేరుగా పరారయ్యారు. హత్యకు సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.