AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNTU: జేఎన్టీయూ విద్యార్థులకు షాక్.. ఆ కోర్సు ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం!

జేఎన్టీయూలో బీబీఏ చదవాలనుకుంటున్న విద్యార్థులకు వర్షిటీ షాక్ ఇచ్చింది. జేఎన్‌టీయూ వర్సిటీ కోర్సుల్లోంచి బీబీఏ కోర్సును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థులకు బోధించేందుకు లెక్చరర్లు లేని కారణంగా బ్యాచులర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీబీఏ) కోర్సును రద్దు చేస్తున్నట్టు వర్షిటీ యాజమాన్యం ప్రకటించింది. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను నిలిపివేస్తూ‘దోస్త్‌’ పోర్టల్‌ నుంచి బీబీఏ కోర్సును తీసివేయాలని ఉన్నత విద్యా మండలిని జేఎన్టీయూ కోరింది.

JNTU: జేఎన్టీయూ విద్యార్థులకు షాక్.. ఆ కోర్సు ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం!
Jntu
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jun 10, 2025 | 12:59 PM

Share

దేశంలోనే మొట్టమొదటి టెక్నాలజీ యూనివర్సిటీగా పేరొందింది యూనివర్సిటీ హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటి. అంతటి ప్రతిష్టాత్మక జేఎన్టీయూను సమస్యలు వీడటం లేదు. ముఖ్యంగా ప్రొఫెసర్ల కొరత ఈ వర్సిటీని పట్టిపీడిస్తోంది. మూడేళ్ల, క్రితం కొత్తగా ప్రవేశ పెట్టిన బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ (బీబీఏ) కోర్సు బోధించేందుకు అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతో ఈ కోర్సును జేఎన్టీయూ రద్దు చేస్తున్నట్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను నిలిపివేస్తూ ‘దోస్త్’ పోర్టల్ నుంచి బీబీఏ కోర్సును తొలగించాలని ఉన్నత విద్యా మండలిని కోరింది.

మేనేజ్ మెంట్ కోర్సుల్లో భాగంగా మార్కెటింగ్, ఫైనాన్స్, మానవ వనరుల నిర్వహణ, ప్రొడక్షన్, ఆపరేషన్‌లో భాగంగా మూడేళ్ల క్రితం బీబీఏ కోర్సును జేఎన్టీయూ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఒక్కో కోర్సులో 60 మందికి ప్రవేశం కల్పించారు. జేఎన్టీయూలో బీబీఏ కోర్సు పూర్తి చేస్తే క్యాంపస్‌ ఇంటర్వ్యూలతో పాటు ఎంబీఏ చదివేందుకు అవకాశాలు ఈజీగా లభించే అవకాశాలు ఉండడంతో ఈ కోర్సుకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరారు. అయితే, తాజాగా ఈ కోర్సు బోధించే లెక్చరర్లు రిటైర్‌ కావడంతో వర్సిటీలో స్టాఫ్ కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిబంధనల మేరకు.. వర్సిటీలో బీబీఏ కోర్సును భోదించేందుకు రెగ్యులర్ లెక్చరర్లు లేకపోవడంతో కోర్సును రద్దు చేయాల్సి వచ్చిందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

అయితే యూనివర్సిటీ అధికారుల నిర్ణయంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. టీచింగ్ స్టాఫ్ రిక్వైర్‌మెంట్ పై సరైన అవగాహన లేకుండా కోర్సును ప్రవేశపెట్టమే కాకుండా.. ఇప్పుడు అంతే అనాలోచితంగా కోర్సును రద్దు చేస్తున్నారని మండిపడుతున్నారు. నార్త్, సౌత్ ఇండియాలో బీబీఏ కోర్సు ఫుల్ డిమాండ్ ఉందని.. అలాంటి కోర్సును తొలగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. బీబీఏ కోర్సులను భోదించే లెక్చరర్లు రిక్రూట్‌ చేసుకోవాలని.. కోర్సును తొలగించకుండా కొనసాగించాలని విద్యార్థి సంఘ నాయకులు అంటున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..