JAGTIAL: జగిత్యాలలో కనువిందు చేస్తున్న అరుదైన కప్పలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు!
జగిత్యాల జిల్లాలో అరుదైన పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తున్నాయి. సహజంగా మన ప్రాంతాల్లో ఈ పసుపు రంగు కప్పలు కనబడవు.. ఎక్కవగా చల్లటి ప్రాంతాల్లో మాత్రమే ఈ కప్పలు కనబడుతాయి. అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలవుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసి కుంటల్లోకి నీళ్లు చేరుతున్నాయి. దీంతో ఈ ఎల్లో ఫ్రాగ్స్ దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన స్థానిక ప్రజలు ఎంతో ఆసక్తిగా ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నారు.

వర్షాకాలం మొదలైందంటే చాలు కాలువలు, చెరువులు, నీటి కుంటలు పొంగి పొర్లుతుంటాయి. ఈ తొలకరి జల్లులు పడినప్పుడు ఆయా ప్రాంతాలు మొత్తం చిత్తడిగా మారిపోతాయి. ఇలాంటి చల్లటి వాతావరణం ఏర్పడగానే చెరువులు, కుంటల వద్ద పెద్దసైజు (బావురు) కప్పలు కనువిందు చేస్తుంటాయి. తొలకరి జల్లులతో పాటు కనిపించే ఈ అరుదైన జీవులు మానవ మనుగడకు ప్రతీకలుగా ఉంటాయి, వాటి రాకతో వర్షాలు వస్తాయని రైతులు నమ్ముతారు. అయితే, వర్షాకాలం మొదలు కావడంతో తాజాగా ఇలాంటి కప్పలు జగిత్యాల జిల్లాలో దర్శనమిచ్చాయి.
జగిత్యాల జిల్లాలో అరుదైన పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తున్నాయి. సహజంగా మన ప్రాంతాల్లో పసుపు రంగు కప్పలు కనబడవు.. చల్లటి ప్రాంతాల్లో మాత్రమే ఈ కప్పలు కనబడుతాయి. అయితే, మన ప్రాంతాల్లో వర్షాకాల సమయంలో మాత్రమే ఈ పసుపు రంగు కప్పలు (ఎల్లో ఫ్రాగ్స్) కనిపిస్తుంటాయి. అయితే, తాజాగా వర్షాకాలం ప్రారంభం కానుండడంతో జగిత్యాలలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాల కురిశాయి. దీంతో ఆ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుకున్నాయి. ఇలా నీరు చేరిన ఓ మడుగులో ఈ పసుపు రంగు కప్పలు దర్శనమిచ్చాయి.
చెరువులు, కుంటలతో పాటు వర్షం కారణంగా ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాలలో నిలిచి ఉన్న నీటిలో కూడా ఈ పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తున్నాయి. సాధారణ కప్పల మాదిరి ముదురు గోదుమ వర్ణంలో కాకుండా పసుపు రంగులో కప్పలు కనిపించడంతో స్థానికులు విచిత్రంగా చూస్తున్నారు. అరుదుగా కనిపించే ఈ కప్పలను చూసేందుకు చిన్నారులు, పెద్దలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. పుసుపు వర్ణం, చిన్న కళ్లతో నీటితో అందంగా కనిపిస్తూ కనివిందు చేస్తున్న వీటిని వీడియోలు, ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..