Viral Video: వామ్మో.. జెర్రిపోతును అమాంతం మింగిన నాగుపాము.. వీడియో చూస్తే వెన్నులో వణుకే
జెర్రిపోతు వర్సెస్ కింగ్ కోబ్రా.. ఒక పాముది జీవన పోరాటం.. మరొక పాముది ఆకలికోసం ఆరాటం.. ఇలా రెండు పాముల మధ్య భీకర పోరాటం జరిగింది.. చివరకు కింగ్ కోబ్రా ముందు జెర్రిగుడ్డు తలవంచక తప్పలేదు. జెర్రిగుడ్డును అమాంతంగా మింగేసింది ఆ భారీ నాగు పాము.. మళ్లీ జెర్రిపోతును బయటకు కక్కి వెళ్లి పోయింది..

జెర్రిపోతు వర్సెస్ కింగ్ కోబ్రా.. ఒక పాముది జీవన పోరాటం.. మరొక పాముది ఆకలికోసం ఆరాటం.. ఇలా రెండు పాముల మధ్య భీకర పోరాటం జరిగింది.. చివరకు కింగ్ కోబ్రా ముందు జెర్రిగుడ్డు తలవంచక తప్పలేదు. జెర్రిగుడ్డును అమాంతంగా మింగేసింది ఆ భారీ నాగు పాము.. మళ్లీ జెర్రిపోతును బయటకు కక్కి వెళ్లి పోయింది.. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట మల్లెపుట్టు ప్రాంతంలో చోటుచేసుకుంది.. ఓ పొలంలో కింగ్ కోబ్రా, జెర్రిపోతు.. రెండు పాములు ఫైటింగ్ చేశాయి. సుమారుగా అర్ధగంట సేపటి వరకు నాగుపాము, జెర్రిపోతు యుద్ధమే చేశాయి. స్థానిక రైతు భాస్కర్ రావు పొలంలో ఈ సన్నివేషం చోటు చేసుకోగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి.. ఈ ఘటనను తన ఫోన్ లో రికార్డు చేశాడు..
భారీ పొడవున్న నాగుపాము ఒక మీటరు పొడవున్న జెర్రిపోతు (జేరిగొడ్డు) పాముపై వేట మొదలుపెట్టింది. పచ్చటి పంట పొలాల్లో నిదానంగా ముందుకెళ్లిన నాగుపాము ఒక్కసారిగా జెర్రిపోతుపై దూకింది. వేగంగా దాన్ని పట్టుకొని తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరకు జెర్రిపోతు ప్రాణాలు విడిచింది. నాగుపాము తన గొంతు ద్వారా దాన్ని మింగడం ప్రారంభించింది. అయితే పామును మింగిన అనంతరం.. దానిని మళ్లీ బయటకు తీసి.. నాగుపాము అక్కడినుండి స్వల్ప సమయంలోనే వెళ్ళిపోయింది.
వీడియో చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. “ఒక పాము మరో పామును ఇలా మింగడం మేమెప్పుడూ చూడలేదు” అని గ్రామస్థులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.