Telangana Rains: రాత్రంతా జాగారం.. కాలనీల్లో అంధకారం.. ఆ జిల్లాలో భీభత్సం సృష్టించిన గాలివాన!
రాష్ట్ర వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం (జూన్ 9) గాలి వాన భీభత్సం సృష్టించింది. కలెక్టరేట్ రోడ్‌లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడటంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సంజీవ్ నగర్, విద్యానగర్, రవీంద్రనగర్, ఓల్డ్ హౌజింగ్ బోర్ట్..

ఆదిలాబాద్, జూన్ 10: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం (జూన్ 9) గాలి వాన భీభత్సం సృష్టించింది. కలెక్టరేట్ రోడ్‌లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడటంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సంజీవ్ నగర్, విద్యానగర్, రవీంద్రనగర్, ఓల్డ్ హౌజింగ్ బోర్ట్ , కేఆర్కే కాలనీలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తీవ్ర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మున్సిపల్ సిబ్బంది ప్రధాన రహదారులపై చెట్లను తొలగిస్తున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి కరెంట్ సరఫరాను పునరుద్దరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలోని పలువార్డుల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి వివిధ ప్రాంతాలలో ( కోర్టుదగ్గర, షేక్ సాహెబ్ పేట్ మజీద్ వద్ద) చెట్లు నేలకొరిగాయి. మున్సిపల్ కమిషనర్, టౌన్ సీఐ పర్యవేక్షణలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నేలకొరిగిన చెట్లను తొలగించడం జరిగింది.
మరోవైపు వర్షం కారణంలో నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలోనూ భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అక్కడక్కడ పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు పలు ఇళ్లల్లో టీవీలు, ఫ్యాన్లు కాలిపోయాయి. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. భైంసా పట్టణంలోని ఏపీ నగర్ కాలోని ఏరియాలో పిడుగు పాటుకు పలు ఇండ్లలోని టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు, కాలిపోయాయి. దీంతో బాధితులు లబోదిదో మంటున్నారు. రాత్రి కురిసిన వర్షానికి కరెంటు సరఫరా లేక ఇబ్బందులు పడ్డారు. గాలి వాన బీభత్సానికి పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.