Telangana: బాబోయ్‌.. చికెన్ బిర్యానీ తిని యువతి మృతి.. మరికొంతమందికి తీవ్ర అస్వస్థత..

వీరిలో ఫూల్‌ కాళీ బాయి అనే 19ఏళ్ల యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: బాబోయ్‌.. చికెన్ బిర్యానీ తిని యువతి మృతి.. మరికొంతమందికి తీవ్ర అస్వస్థత..
Biryani
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 05, 2024 | 7:59 PM

ఇటీవలే హైదరాబాద్‌లో మోమోస్ తిని ఓ మహిళా చనిపోగా.. సుమారు 50 మంది అస్వస్థతకు గురైన విషయం మర్చిపోక ముందే.. మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో.. చికెన్ బిర్యానీ తిని ఓ యువతి మృతిచెందిగా మరో 15 మంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. రెండు రోజుల క్రితం బోథ్ మండల కేంద్రంలోని సెయింట్ థామస్ స్కూల్ సిబ్బంది ఐదుగురు కలిసి నిర్మల్‌లోని గ్రిల్ నైన్ హోటల్లో భోజనం చేశారు..చికెన్ బిర్యానీ తిన్నారు. వీరిలో ఫూల్‌ కాళీ బాయి అనే 19ఏళ్ల యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కామారెడ్డికి తరలించారు. కాగా, గ్రిల్‌ నైన్‌ మల్టీ కుజైన్‌ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాఠశాల యజమాన్యం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

ఇదే హోటల్లో నవంబర్ 4 సోమవారం రాత్రి భోజనం చేసిన దాదాపు 20 మంది కూడా అస్వస్థతకు గురైనట్టుగా తెలిసింది.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం.. అయితే.. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే రంగంలోకి దిగి.. ఆ హోటల్ను తనిఖీ చేసి సీజ్ చేశారని తెలిసింది. మృతి చెందిన యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గ్రీల్ నైన్ రెస్టారెంట్ పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బోథ్ పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..