వరినాట్లు వేసేందుకు వెళ్లిన వ్యవసాయ కూలీ.. ఊహించని ప్రమాదంలో చిక్కుకొని నరకయాతన
పొలం పనికి వెళ్లిన ఓ కూలీ ప్రమాదంలో ఇరుక్కుపోయి.. ఏకంగా నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం సోలిపేట గ్రామానికి చెందిన పద్మ అనే వ్యవసాయ కూలి.. గ్రామంలో ఓ రైతు పొలంలో నాటు వేయడానికి వెళ్ళింది.

పొలం పనికి వెళ్లిన ఓ కూలీ ప్రమాదంలో ఇరుక్కుపోయి.. ఏకంగా నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం సోలిపేట గ్రామానికి చెందిన పద్మ అనే వ్యవసాయ కూలి.. గ్రామంలో ఓ రైతు పొలంలో నాటు వేయడానికి వెళ్ళింది. ఇతర మహిళా కూలీలతో కలిసి నాటు వేస్తోంది. ఈ సమయంలో ఒక్కసారిగా నొప్పి అంటూ పద్మ కేకలు వేసింది. ఏదైనా పాము కాటు వేసిందేమోనని ఇతర కూలీలు భయబ్రాంతులకు గురయ్యారు. కానీ పద్మ కాలు గుంతలో ఇరుక్కుపోయింది. అయితే గతంలోనే ఈ పొలానికి చెందిన రైతు ఆ పోలంలోనే బోరు వేయించాడు. కానీ నీరు రాకపోవడంతో దాన్ని వదిలేశాడు. చివరికి ఆ ప్రాంతాన్ని పోలం మడిగా మార్చి వరి నాటు వేస్తున్నాడు.
ఈ క్రమంలోనే నాట్లు వేస్తుండగా పద్మ కాలు అందలో ఇరుక్కుపోయింది. ఆమెను బయటకు తీసేందుకు కూలీలు చాలా సేపు ప్రయత్నించారు. ఆమె బయటకు రాకపోవడంతో చివరికి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు జేసిబీ సహాయంతో కేసింగ్‌కు సమాంతరంగా గోతిని తవ్వించారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి చివరికి పద్మను బయటకు తీశారు. అయితే నాలుగు గంటల పాటు పద్మ నరకయాతన అనుభవించింది. అనంతరం ఆమెను చికిత్స కోసం భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ప్రమాదాలను నివారించాలంటే పాత బోరుబావుల్లో నీరు రాకపోతే వెంటనే వాటిని పూడ్చి వేయాలని పోలీసులు రైతులకు సూచిస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
