AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి దారుణ హత్య.. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం!

కొత్తగూడెం వైశ్య కాలనీలో జరిగిన దారుణ ఘటన స్థానికుల ఒంట్లో వణుకు పుట్టించింది. ఎవరు చంపారో తెలియదు.. ఒళ్లంతా రక్తమోడేలా అత్యంత పాశవికంగా కొట్టి చంపారు. ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ మైండ్ బ్లాక్ అయ్యే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ఇంట్లోనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి దారుణ హత్య.. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం!
Retired Singareni Employee
N Narayana Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Sep 25, 2025 | 4:49 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైశ్య కాలనీలో జరిగిన దారుణ ఘటన స్థానికుల ఒంట్లో వణుకు పుట్టించింది. ఎవరు చంపారో తెలియదు.. ఒళ్లంతా రక్తమోడేలా అత్యంత పాశవికంగా కొట్టి చంపారు. ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ మైండ్ బ్లాక్ అయ్యే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మర్డర్ మాటున ట్రయాంగిల్ రిలేషన్‌ను పూసగుచ్చినట్టు వివరించారు.

60 ఏళ్ళ గుబ్బల రామ్మోహన్‌రావు అనే వ్యక్తి సింగరేణిలో ఉద్యోగిగా పనిచేశారు. ఈ మధ్యే రిటైర్డ్ అయ్యాడు. ఉద్యోగం చేస్తున్నంత కాలం గౌతమపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేవాడు. ఆ తర్వాత కొత్తగూడెంలోని గణేష్‌ బస్తీ ప్రాంతానికి భార్య నలుగురు పిల్లలతో సహా షిప్ట్ అయ్యాడు. రామ్మోహన్‌ రావు గత పదిహేనేళ్లుగా ఓ వివాహితతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె భర్తతోనూ ఇతనికి మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఇల్లీగల్ వ్యవహారం బయటపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. కట్‌చేస్తే.. రామ్మోహన్‌రావుతో సంబంధం పెట్టుకున్న వివాహిత.. లోకల్‌గా ఉండే షాకేర్‌ అనే యువకుడికి కనెక్ట్ అయింది. అతనితో శారీరకంగా దగ్గరయింది. ఈ విషయం రామ్మోహన్‌రావుకి తెలియడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. మ్యాటర్‌ మొత్తం వివాహిత భర్తకు చెప్పేశాడు.

సుత్తితో దాడి చేసి..

రామ్మోహన్రావు సోమవారం రాత్రి తన భార్యతో కలిసి ఇంట్లో కూర్చుని అల్పాహారం తీసుకుంటున్నాడు. అదే సమయంలో హఠాత్తుగా మాస్క్ ధరించిన ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి సుత్తితో దాడిచేసి హత్య చేసి పరారయ్యాడు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. నిందితుడు వారిపై కూడా దాడిచేసేందుకు యత్నించాడు. కొత్తగూడెం పట్టణం గణేష్ బస్తీలో సోమవారం రాత్రి పది గంటలసమయంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్‌‌తో గాలింపు చేపట్టారు.

మర్డర్ స్కెచ్..

రామ్మోహన్‌రావుతో తమకు ఎప్పటికైనా ఇబ్బందేనని గ్రహించిన సదరు వివాహిత.. అదే విషయాన్ని ప్రియుడైన షాకేర్‌కు వివరించింది. ఇద్దరూ కలిసి హత్యకు కుట్రపన్నారు. సెప్టెంబర్ 22న స్నేహితుడు వంశీని వెంటబెట్టుకుని రామ్మోహన్‌రావు ఇంటికెళ్లాడు షాకేర్. ఇద్దరూ కలిసి సుత్తితో తలపై బాది హతమార్చారు. ఆ తర్వాత సుత్తిని డ్రైనేజీలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దర్యాప్తు చేపట్టిన 36 గంటల్లోనే హంతకులిద్దరినీ అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. వివాహితతో ఇద్దరు రిలేషన్ పెట్టుకున్నారని.. ఆ క్రమంలోనే హత్య జరిగినట్టు పోలీసులు తేల్చేశారు.

నిందితులపై రౌడీ షీట్..

రామ్మోహన్‌రావును చంపిన షాకేర్‌, వంశీలపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు. భర్త ఉండగానే ఇద్దరితో సంబంధం పెట్టుకున్న వివాహిత.. ఒకరి హత్యకు కారణమైంది. ఇప్పుడీ కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోవడంతో నలుగురు పిల్లల భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..