Cyber Crime: ఎవడండీ వీడు.. ఏకంగా 66 కోట్ల మంది డేటా చోరీ చేశాడు.. కోటీ మంది హైదరాబాద్ వారే
ఓ నిందితుడు కోట్ల మందికి సంబంధిచిన డేటా చోరి చేయడం దేశంలో కలకలం రేపుతోంది. అయితే ఎట్టకేలకు ఈ కేసులో నిందితుడ్ని శనివారం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ఓ నిందితుడు కోట్ల మందికి సంబంధిచిన డేటా చోరి చేయడం దేశంలో కలకలం రేపుతోంది. అయితే ఎట్టకేలకు ఈ కేసులో నిందితుడ్ని శనివారం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హర్యాణాలోని ఫరీదాబాద్ కు చెందిన వినయ్ భరద్వాజగా నిందితుడ్ని గుర్తించారు. అతని నుంచి రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వివరాలు, ఇతర వ్యక్తులు, విద్యార్థుల డేటాను కూడా నిందితుడు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.
inspirewebz అనే వెబ్‌సైట్ ను ఏర్పాటు చేసి దాని ద్వారానే చోరీ చేసిన డేటాను అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జీఎస్టీ, పాన్ కార్డ్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, ఇన్‌స్టాగ్రామ్, బుక్ మై షో, ఆప్ స్టాక్స్ సంస్థల నుంచి, బైజూస్ నుంచి 9, 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థుల డేటాను నిందితుడు చోరీ చేసినట్లు విచారణలో తేలిసినట్లు వెల్లడించారు. మొత్తం 24 రాష్ట్రాలు, 8 మెట్రో పాలిటన్ సిటీల నుంచి వినయ్ భరద్వాజ డేటా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే మొత్తం 66 కోట్ల మంది డేటా చోరీకి గురవ్వగా ఇందులో హైదరాబాద్ కు చెందిన వారివే కొటి మందివి చోరీ కావడం గమనార్హం. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు కోట్ల 50 లక్షల మంది డేటా.. మహారాష్ట్రకు చెందిన నాలుగు కోట్ల మంది డేటా చోరీ అయినట్లు గుర్తించారు. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఈ దర్యాప్తులో భాగమయ్యాయి. ముంబై, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన ఉద్యోగులే సూత్రధారులుగా ఉన్నారు. జస్ట్ డయల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల నుంచి డేటా చోరీ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పలు సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..