Telangana: ఏంరా వారీ తిక్క కుదిరిందా!.. ప్లాన్ బిస్కేట్ అయ్యింది.. ఒళ్లు చింతపండు అయ్యింది..

మెల్లగా వచ్చాడు. పార్క్ చేసిన ఫోర్ వీలర్ వాహనంపై కన్నేశాడు. అటూ ఇటూ చూశాడు. ఎవరూ లేరని గట్టిగానే భావించాడు. కానీ చూసేవాళ్లు చూస్తూనే ఉన్నారు వాడు ఏం చేస్తాడా అని. వాళ్లు అనుకున్నట్లే వీడు చోరీకి ప్రయత్నించాడు.

Telangana: ఏంరా వారీ తిక్క కుదిరిందా!.. ప్లాన్ బిస్కేట్ అయ్యింది.. ఒళ్లు చింతపండు అయ్యింది..
Thief
Follow us

|

Updated on: Apr 02, 2023 | 12:50 PM

మెల్లగా వచ్చాడు. పార్క్ చేసిన ఫోర్ వీలర్ వాహనంపై కన్నేశాడు. అటూ ఇటూ చూశాడు. ఎవరూ లేరని గట్టిగానే భావించాడు. కానీ చూసేవాళ్లు చూస్తూనే ఉన్నారు వాడు ఏం చేస్తాడా అని. వాళ్లు అనుకున్నట్లే వీడు చోరీకి ప్రయత్నించాడు. వాహనం వద్దకు వచ్చి స్టార్ట్ చేసేందుకు యత్నించాడు. ఇంకేముంది.. పరుగెత్తుకుంటూ వచ్చి ఆ కేటుగాడిని పట్టుకున్నారు స్థానికులు. స్తంభానికి కట్టేసి పొట్టు పొట్టుగా కొట్టారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చి, వారికి అప్పగించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో గల పెట్రోల్ బంకు వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో గల పెట్రోల్ బంకులో ఫోర్ వీలర్ వాహనాన్ని పార్కింగ్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఓ గుర్తుతెలియని దుండగుడు పెట్రోల్ బంక్‌లోకి చొరబడి ఫోర్ వీలర్ వాహనం డోర్ తెరిచేందుకు ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా రాయితో డోర్ లాక్‌ పగలగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. శబ్దం రావడంతో వాచ్‌మెన్ నిద్రలేచి దొంగను గమనించాడు. మరికొందరు స్థానికులు కూడా దొంగను గమనించారు. ఇంతలో వాచ్‌మెన్ ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ కేటుగాడు రాళ్లతో వాచ్‌మెన్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు దొంగను పట్టుకొని పెట్రోల్ బంక్‌లో స్తంభానికి తాళ్లతో కట్టెసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి దొంగను పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌