AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన వ్యాపారం నడుస్తలేదని.. ఎదురుగా ఉన్న వ్యాపారంపై కోపం.. ఏం చేశాఓ తెలుసా

చొప్పదండి మండలం కేంద్రంలో కోడూరి శ్రీనివాస్ గాలిపేల్లి కనకయ్య అను ఇద్దరు వస్త్ర వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

తన వ్యాపారం నడుస్తలేదని.. ఎదురుగా ఉన్న వ్యాపారంపై కోపం.. ఏం చేశాఓ తెలుసా
Clothes Store Fire
G Sampath Kumar
| Edited By: |

Updated on: Nov 17, 2024 | 8:08 AM

Share

ఓ వ్యాపారి తన వ్యాపారం నడుస్తలేదని కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకోవడమే కాదు. షాప్‌ను తగులబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ఏకంగా ఎదుటి షాప్ ఫై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో షాప్‌లోని బట్టలన్నీ కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

చొప్పదండి మండలం కేంద్రంలో కోడూరి శ్రీనివాస్ గాలిపేల్లి కనకయ్య అను ఇద్దరు వస్త్ర వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిరువురి దుకాణాలు ఎదురెదురుగా ఉంటాయి. గత కొద్ది రోజులుగా కోడూరి శ్రీనివాస్ వ్యాపారం సరిగా నడవట్లేదని అప్పులు అయినాయని మనస్తాపం చెందాడు. గాలిపెల్లి కనకయ్యపైన ద్వేషం పెంచుకుని అతని దుకాణాలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

ఈ దుర్ఘటనలో కనకయ్య దుకాణం చాలా వరకు కాలిపోయింది. తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని కనుకయ్య తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అరెస్ట్‌ చేసి స్టేషన్ తీసుకువెళ్లారు. జరిగిన ఘటనతో పూర్తిగా నష్టపోయానని తమకు న్యాయం జరిగేలా చూడాలని కనకయ్య కోరారు. కోపం మాటమో గానీ.. నిందుతుడు కటకటాలపాలయ్యారు. ఈ సంఘటన చొప్పదండిలో సంచలనంగా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..