AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లోన్‌ కట్టలేకపోతే చచ్చిపో.. బరితెగించిన ఫైనాన్స్‌ సంస్థ.. ఇల్లు సీజ్ చేసి..

లోన్‌ యాప్స్‌ ఆగడాలు రోజురోజూకు మితిమీరిపోతున్నాయి. చస్తే చావు, మాకేంటి?. లోన్‌ మాత్రం కట్టాల్సిందేనంటూ బెదిరింపులకు దిగింది వెరిటాస్‌ ఫైనాన్స్‌ సంస్థ. ఈఎంఐ కట్టలేదని ఏకంగా ఇంటినే స్వాధీనం చేసుకుంది.

Telangana: లోన్‌ కట్టలేకపోతే చచ్చిపో.. బరితెగించిన ఫైనాన్స్‌ సంస్థ.. ఇల్లు సీజ్ చేసి..
Loan App
Shaik Madar Saheb
|

Updated on: Jul 31, 2022 | 5:10 AM

Share

Loan app harassment: తెలుగు రాష్ట్రాల్లో లోన్‌ యాప్స్‌ ఆగడాలు, ఫైనాన్స్‌ సంస్థల వేధింపులు ఆగడం లేదు. చచ్చిపోతే చచ్చిపో, మాకేంటి?. చచ్చిపోయినా సరే డబ్బు మాత్రం కట్టాల్సిందేనంటూ యమకింకరుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఎంతోమంది ఈ లోన్‌ యాప్స్‌, ఫైనాన్స్‌ సంస్థల వేధింపులకు బలైపోయినా, వాళ్ల తీరు మాత్రం మారడం లేదు. మొన్నటికిమొన్న ఏపీలో రికవరీ ఏజెంట్స్‌ వేధింపులు భరించలేక ఓ యువతి సూసైడ్‌ చేసుకుంటే, ఇప్పుడు తెలంగాణలో ఏకంగా ఇంటినే స్వాధీనం చేసుకుంటున్నట్లు గోడలపై రాతలు రాశారు. ఆర్యోగం బాగాలేదు, కొద్దిరోజులు ఆగండి, మీ డబ్బు మొత్తం కట్టేస్తానంటూ వేడుకున్నా కనికరించలేదు రికవరీ ఏజెంట్లు.. చచ్చిపోతే చచ్చిపో, మాకేంటి?. చచ్చినా సరే డబ్బు మాత్రం కట్టాల్సిందేనంటూ బెదిరింపులకు దిగాడు ఓ ఏజెంట్.. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది.

నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం కమలాపూర్‌ గ్రామంలో లోన్‌ కట్టలేదని ఓ ఇంటిని స్వాధీనం చేసుకుంది వెరిటాస్‌ ఫైనాన్స్‌ సంస్థ. దాంతో, తమకు ఆత్మహత్యే శరణ్యమని బాధితుడు మోహన్‌ లబోదిబోమంటున్నాడు. వెరిటాస్‌ ఫైనాన్స్‌ సంస్థ బరితెగించి, ఇంటిని స్వాధీనం చేసుకోవడంతో బాధితుడు మోహన్‌ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఊరిలో తమ పరువు పోయిందని, తమకిక చావే దిక్కు అంటూ వాపోతున్నారు. ప్రభుత్వం కల్పించుకుని వెరిటాస్‌ ఫైనాన్స్‌ సంస్థ వేధింపుల నుంచి కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక