Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబాన్ని మింగేసిన లారీ డ్రైవర్ నిద్రమత్తు! దైవదర్శనానికి వెళ్తుండగా ఘటన
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.. మరో ముగ్గురు ఎంజీఎం ఆస్పత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. మృతులు క్షతగాత్రులు అంతా ఒకే కుటుంబం. వేములవాడ దైవదర్శనానికి వెళ్తుండగా వీరిని మృత్యు కభళించింది. అతివేగంగా నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ వీరికి ఎదురుగా వచ్చిన లారీ డ్రైవర్ వీళ్ళ ఆయువు..
హనుమకొండ, డిసెంబర్ 22: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.. మరో ముగ్గురు ఎంజీఎం ఆస్పత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. మృతులు క్షతగాత్రులు అంతా ఒకే కుటుంబం. వేములవాడ దైవదర్శనానికి వెళ్తుండగా వీరిని మృత్యు కభళించింది. అతివేగంగా నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ వీరికి ఎదురుగా వచ్చిన లారీ డ్రైవర్ వీళ్ళ ఆయువు మింగేశాడు. మృతులు క్షతగాత్రులు అంతా ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించారు. మృతులలో కాంతయ్య, శంకర్, భరత్, చందన నలుగురు ఉన్నారు. రేణుక, భార్గవ్, శ్రీదేవి అనే మరో ముగ్గురు ఎంజీఎం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు
కాంతయ్య, శంకర్ స్వంత అన్నదమ్ములు వారి కుటుంబం.. వీరంతా AP5 CA 4444 నెంబర్ గల కారులో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. తెల్లవారుజామున కరీంనగర్ వైపు నుండి హనుమకొండ వైపు వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న కారును రోడ్డు క్రాస్ చేసి ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది.. లారీ అతివేగంగా ఉండడం తో కారు రోడ్డు పక్కన ఉన్న ముళ్లపదలోకి దూసుకెళ్లింది.. కారులో చిక్కుకున్న ఈ కుటుంబం దాదాపు అర్థగంట పాటు మృతవుతో పోరాడారు.. పోలీసులు అక్కడికి చేరుకొని తీవ్ర గాయాలపాలైన వారిని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.. నాలుగు డెడ్ బాడీస్ ను బయటికు తీసి ఎంజిఎం మార్చరికి తరలించారు.
సంఘటన స్థలాన్ని బట్టి చూస్తే లారీ డ్రైవర్ అతివేగం నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది.. జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్ క్రాస్ చేసి వచ్చి మరి వీరి కారును అతివేగంగా ఢీకొట్టాడు.. అనంతరం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేములవాడ దైవ దర్శనానికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వారి కుటుంబంలో తీరని విషాదం అలముకుంది.. ఊరంతా బోరుమంటున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.