AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయి పేరు మీద 2 కోట్ల భూమి.. కొన్నేళ్లకు ఎంట్రీ ఇచ్చిన మేనమామ.. మధ్యలో పోలీసులు.. చివరకు..

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని గోకుల్ నగర్ కాలనీ చెందిన పావని చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. పావనికి 8 నెలల వయసులోనే తల్లిని కోల్పోవడంతో తల్లి బంధువులు తల్లి వద్ద రూ.7 లక్షల రూపాయలు సమకూర్చారు. మరో సంవత్సరం తర్వాత తండ్రి కూడా చనిపోవడంతో పావని ఒంటరి అయింది.

అమ్మాయి పేరు మీద 2 కోట్ల భూమి.. కొన్నేళ్లకు ఎంట్రీ ఇచ్చిన మేనమామ.. మధ్యలో పోలీసులు.. చివరకు..
Land Dispute In Achampet
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jun 01, 2025 | 12:00 PM

Share

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని గోకుల్ నగర్ కాలనీ చెందిన పావని చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. పావనికి 8 నెలల వయసులోనే తల్లిని కోల్పోవడంతో తల్లి బంధువులు తల్లి వద్ద రూ.7 లక్షల రూపాయలు సమకూర్చారు. మరో సంవత్సరం తర్వాత తండ్రి కూడా చనిపోవడంతో పావని ఒంటరి అయింది. తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోవడంతో పావని ఆలనాపాలనా అమ్మమ్మ చూసుకుంది. కొన్ని సంవత్సరాలు గడవగానే అమ్మమ్మ కూడా చనిపోయింది. దీంతో పావని అనాథగా మారిపోయింది. ఈ దీనగాథ తెలుసుకొని అచ్చంపేటలోని జెయంజె పాఠశాలకు చెందిన యజమాన్యం పావనీని తమ పాఠశాలలో చేర్చుకొని పదవ తరగతి, ఇంటర్ మీడియట్ వరకు చదివించారు.

అయితే పావని పేరుపై అచ్చంపేట టౌన్ శివారులో రెండు ఎకరాల 19 గుంటల భూమి ఉంది. ఇప్పుడు ఆ భూమి కోట్ల రూపాయల విలువ చేస్తోంది. అయితే ఈ భూమిని ఎలాగైనా కాజేయాలని మేనమామ కుటుంబం పన్నాగం పన్నింది. పావనికి ఉన్నత చదువులు చదివిస్తామని మేనమామ బాలయ్య పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళాడు. ఇక ఇన్నాళ్లకైన తన బంధువులు వచ్చారన్న సంతోషంతో మేనమామను నమ్మి పావని సైతం వాళ్ళతో కలిసి వెళ్ళింది. ఇక మేనమామ బాలయ్య ఇంటికి వెళ్లాక అసలు కుట్ర కోణం బయటకు వచ్చింది. పావని ప్రస్తుతం మేజర్ (18 ఏళ్లు) కావడంతో పెళ్లి చేసుకుంటే ఆ భూమి వచ్చే ఆమె భర్తకు సొంతమవుతుందని భావించారు. అలా జరగకూడదు అంటే పెళ్ళికి ముందే పావని పేరుపై ఉన్న భూమిలో కొంత తన పేరుపై రాయించుకోవాలని ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం పావని ని భయపెట్టి, దుర్భాషలడుతూ ప్రతి రోజు ఒత్తిడి పెంచారు మేనమామ బాలయ్య, ఆయన భార్య.. ఈ క్రమంలో వారి వేధింపులు భరించలేక ఒక ఎకరం 19 గుంటల భూమిని మేనమామపై మార్చేందుకు ఒప్పుకుంది. ఎవరికి తెలియకుండా వెంటనే రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ సైతం బుక్ చేశారు. విషయం బయటకు తెలియడంతో మేనమామ, అత్తల ప్లాన్ ఫ్లాప్ అయ్యింది.

రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి రాగానే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, బాలసదన్ అధికారులు మేనమామ బాలయ్య, అత్తను ఆరా తీశారు. బాధితురాలు పావని వద్ద భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలు, జరిగిన పరిణామాలను తెలుసుకున్నారు. భూమి కోసం మేనమామ, అత్త వేధింపులను అధికారులకు పావని వివరించింది. దీంతో భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా బాలయ్య కుటుంబానికి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించారు. పావనిని నాగర్ కర్నూల్ సఖి కేంద్రానికి తరలించారు. ఉన్నత చదువులు చదివేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..