WhatsApp Privacy Policy: వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సంస్థ సరికొత్త ప్రచారం.. కొత్త డెడ్‌లైన్ ఇదే..!
వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీ భారతదేశంలో సరికొత్త ప్రచారంతో అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. కొత్త విధాన మార్పులను చదవడానికి, అంగీకరించడానికి
WhatsApp Privacy Policy: వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీ భారతదేశంలో సరికొత్త ప్రచారంతో అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. కొత్త విధాన మార్పులను చదవడానికి, అంగీకరించడానికి వినియోగదారులకు తగినంత సమయాన్ని అందించడానికి సంస్థ రెడీ అయింది. కొత్త ప్రచారంలో భాగంగా చిన్న బ్యానర్‌గా ఉంటుంది, అది చాట్ లిస్ట్ పైన కనిపిస్తుంది. “సమీక్షించడానికి నొక్కండి(Tap to review)” అనే ఆప్షన్ ఉంటుంది. టాప్ చేస్తే.. కొత్త పాలసీకి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. వినియోగదారులకు పాలసీని అర్థం చేసుకుని మే 15 లోపు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 8 నుంచి ఈ పాలసీని అమలు చేయాలని వాట్సాప్ తొలుత భావించింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై ఇండియా వివాదం రేగిన విషయం తెలిసిందే. వినియోగదారుల భద్రతను ఈ పాలసీ దెబ్బతీస్తుందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో చాలా తక్కువ సమయంలో టెలిగ్రామ్, సిగ్నల్ డౌన్‌లోడ్‌లు పెరిగాయి. వాట్సాప్ యాప్‌లో కొత్త మార్పులను అంగీకరించడానికి వినియోగదారులను బలవంత పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన యూజర్లు వేరే యాప్స్ వైపు మళ్లారు. దీంతో సంస్థ తన పంథాను మార్చుకుంది. వినియోగదారులకు విధానాన్ని వివరించాలని ఫిక్స్ అయ్యింది. అంతేకాదు వినియోగదారుల భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లదని ఓ ప్రకటన కూడా చేసింది. ఇటీవల తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీని మూడు నెలల తర్వాతే అమలు చేస్తామని వాట్సాప్ తెలిపింది. తమ కొత్త పాలసీతో వ్యక్తిగత గోప్యతా హక్కులపై ఎలాంటి ప్రభావమూ ఉండదని సంస్థ వివరణ ఇచ్చింది.
Also Read: