Today Fuel Price: ఈరోజు కూడా పెరిగిన పెట్రోల్ ధరలు.. వరుసగా 11వ రోజు.. సెంచరీ కొడుతుందా..?
Today Fuel Price: పెట్రోల్ ధరల పెరుగుదలకు అడ్డుకట్ల పడట్లేదు. రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లీటర్ ప్రీమియం..
Today Fuel Price: పెట్రోల్ ధరల పెరుగుదలకు అడ్డుకట్ల పడట్లేదు. రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లీటర్ ప్రీమియం పెట్రోల్ రూ. వందకు చేరువయ్యాయి. తాజాగా వరుసగా 11వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ సెంచరీ కొట్టనుందా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి శుక్రవారం డీజిల్, పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.89.88 (గురువారం రూ.89.54) ఉండగా డీజిల్ రూ. 80.27 (గురువారం రూ.79.95)గా నమోదైంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.96.32గా ఉండగా.. డీజిల్ 87.32గా కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.93.45 (గురువారం రూ. 93.10)గా ఉండగా.. డీజిల్ రూ.87.91 (గురువారం రూ.87.55) వద్ద కొనసాగుతోంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.93.33 (గురువారం 93.23)గా ఉండగా డీజిల్ రూ.87.42 (గురువారం రూ.87.31)గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.96.16 (గురువారం రూ.95.86) ఉండగా, డీజిల్ రూ.89.69 (గురువారం రూ.89.42) వద్ద కొనసాగుతోంది. సాగరతీరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.95.18 (గురువారం రూ.94.73) ఉండగా డీజిల్ రూ.88.76 ( గురువారం రూ.88.32)గా ఉంది.